BigTV English

Women Scheme : మహిళల్ని మహారాణులుగా చేసే పథకాలు – వీటి ప్రయోజనాల గురించి తెలుసా.?

Women Scheme : మహిళల్ని మహారాణులుగా చేసే పథకాలు – వీటి ప్రయోజనాల గురించి తెలుసా.?
Women Scheme : దేశంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల్ని అమలు చేస్తోంది. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు, ఆర్థిక, సామాజిక ప్రయోజనాల్ని కల్పించేందుకు అనేక కార్యక్రమాల్ని రూపొందించి, అమలు పరుస్తున్నారు. వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా, గౌరవప్రథమైన జీవితాన్ని పొందేందుకు తోడుగా నిలుస్తున్నాయి ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మహిళలకు చేదోడుగా ఉండేందుకు ప్రత్యేకంగా పని చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వంలోని మహిళా, శిశు మంత్రిత్వం శాఖ వేరువేరు సమస్యలకు పరిష్కారంగా అనేక కార్యక్రమాల్ని అమల్లోకి తీసుకువచ్చింది. మరి.. మహిళలకు కేంద్రం అందిస్తున్న సహాయ, సహకారాలు ఏంటో తెలుసుకుందాం.
1. స్వధార్ గృహ్ పథకం : క్లిష్ట పరిస్థితులలో చిక్కుని బాధితులుగా మారిన మహిళలు గౌరవప్రదమైన జీవితం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాయం చేస్తోంది. వారి తిరిగి కోలుకునేందుకు తోడుగా నిలుస్తోంది. అవమానితమైన, నిరాశ్రయంగా మారిన మహిళలకు ఈ పథకం ద్వారా తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తారు. ఆ సమయంలో మహిళలకు భోజనం, వైద్య సేవలు అందించడంతో పాటు వారికి కావాల్సిన నిపుణుల కౌన్సిలింగు, మానసిక ధైర్యం కల్పిస్తారు. అంతే కాదు.. మహిళల జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రొఫెషనల్ ట్రైనింగ్ అందిస్తారు. అందుబాటులోని ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం.
2. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ : కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development – WCD) అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా వివిధ వృత్తుల్లో పని చేసే మహిళలకు సురక్షితమైన, అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం శ్రామిక మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం, వారి పిల్లలకు డే కేర్ సౌకర్యం కల్పించడం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టణాలు, సెమీ అర్భన్ ప్రాంతాల్లోనూ వివిధ పరిశ్రమలు, సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. వాటిలో ఉద్యోగాలు, పనులు చేసే మహిళలు ఈ హాస్టల్లో సురక్షితంగా ఉండొచ్చు. ఈ హాస్టళ్లో ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో పని చేసే మహిళలు ఉండేందుకు వీలుంటుంది. అయితే.. వార్షిక ఆదాయం రూ. 50,000 నుంచి 75,000 మధ్య ఉండాలి.
3. బేటీ బచావో బేటీ పఢావో (BBBP) : కేవలం బాలికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని2015 జనవరి 22న ప్రారంభించారు. బాలికల జనన నిష్పత్తి తగ్గిపోవడం, లింగ వివక్ష, బాలికల చదువుపై నిర్లక్ష్యం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని రూపొందించి, అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా మగబిడ్డకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ధోరణిని మార్చేందుకు సైతం ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. బాలికలకు సరైన విద్య అవకాశాలను కల్పించడంతో పాటు లింగ వివక్షను అరికట్టడం కోసం సాంఘిక మార్పులకు దోహదపడేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
4. మహిళా శక్తి కేంద్రం (MSK) : గ్రామీణ మహిళలకు సమాజంలో మరింత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. తద్వారా వారికి సాధికారత కల్పించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర ప్రాయోజిత పథకంగా మహిళా శక్తి కేంద్రం (MSK) పథకాన్ని నవంబర్ 2017లో ప్రారంభించారు. ఇందులో భాగంగా.. మహిళల కోసం ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాల అమలులో అంతర్-రంగాల కలయికను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు – కేంద్రం మధ్య 60:40 నిష్పత్తిలో నిధుల ఏర్పాటు చేసుకుని.. పథకాల్ని అమలు చేస్తున్నారు. ఇందులో.. గ్రామ స్థాయిలో మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసి, అవసరమైన సహాయాన్ని అందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు (NGOs), మహిళా సమూహాలు (SHGs) సహాయంతో కార్యక్రమాలను అమలు చేసే ప్రణాళికల్ని అమలు చేస్తున్నారు.
5. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY): ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అనేది కేంద్ర ప్రాయోజిత షరతులతో కూడిన నగదు బదిలీ పథకం. ఇది 2017 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. PMMVY కింద గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు (PW&LM) ఆర్థిక సాయం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన పోషకాహారం అందించడం, గర్భిణీ స్త్రీలు వైద్య సేవలను పొందేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. శిశువులకు తల్లిపాలు అందించేలా అవగాహన కల్పించడంతో పాటు ప్రసవ సమయంలో తల్లుల మరణాన్ని తగ్గించడానికి వైద్య సేవలు అందించడం. అలాగే.. గర్భిణీ స్త్రీలకు మొదటి కాన్పు సమయంలో ₹5,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మొదటి విడతలో గర్భం దాల్చి 5 నెలలు పూర్తయినప్పుడు రూ.1 వెయ్యి, కనీసం ఒక ప్రీ-నేటల్ చెకప్ (ANC) చేసిన తర్వాత రూ. 2,000, బిడ్డ జన్మించి, మొదటి తల్లిపాలు అందించి, మొదటి టీకా తీసుకున్న తర్వాత మరో విడుతలో రూ. 2,000 వేలు అందిస్తున్నారు.
6. సుకన్య సమృద్ధి యోజన (SSY): ఈ పథకం కింద, 10 సంవత్సరాల లోపు వయస్సు గల బాలికల పేరుపై బ్యాంక్ ఖాతా ప్రారంభించి, ఆర్థిక పొదుపును ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ఒక ప్రత్యేక పొదుపు పథకం. ఈ పథకాన్ని “బేటీ బచావో, బేటీ పఢావో” కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టారు. బాలికల భవిష్యత్తును ఆర్థికపరంగా సురక్షితంగా తీర్చిదిద్దేందుకు, వారి విద్య, వివాహ ఖర్చులను భరించేందుకు ఉత్తమ పథకంగా నిలుస్తోంది. 21 ఏళ్లు లేదా బాలిక 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం అయినప్పుడు ఈ పథకంలోని పొదుపు మొత్తాల్ని తిరిగి తీసుకోవచ్చు. కాగా.. ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్,బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడిగా ఏటా రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకునేందుకు అవకాశం ఉంది. బాలిక పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పథకంలో మిగతా పొదుపు మొత్తాల కంటే ఎక్కువగా వడ్డీ రేటు లభిస్తుంటుంది.
వీటితో పాటే.. బాలికలు, యువతులు, మహిళల కోసం.. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (KGBV), ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY), సురక్షిత మాతృత్వ హామీ సుమన్ యోజన, వన్ స్టాప్ సెంటర్ (OSC) పథకం, మహిళా హెల్ప్‌లైన్ (WHL), ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY), మహిళా ఈ-హాట్ (Mahila E-Haat), మహిళా కోశ్ (RMK), మిషన్ శక్తి, బీమా సఖి యోజన.. వంటి అనేక పథకాల్నిఅమలు చేస్తోంది.


Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×