Big Stories

Lok Sabha Elections 2024: ప్రారంభమైన రెండోదశ ఎన్నికల పోలింగ్..

Lok Sabha Elections: పార్లమెంటు ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో మొత్తం 13 రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇందులో మొత్తం 88 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేష్లన్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ లో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

కర్ణాటక, రాజస్థాన్, కేరళ, త్రిపుర, ఛత్తీస్ గఢ్, అస్సాం, బీహార్, పశ్చిమబెంగాల్, మణిపూర్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు.

- Advertisement -

Also Read:7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

అయితే.. రెండోదశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కీలకంగా మారింది. ఎందుకంటే కేరళలోని వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి కె. సురేంద్రన్, సీపీఐ నాయకురాలు అన్నీ రాజాతో పాటు పలువురు కీలక నేతలు పోటీ పడుతున్న స్థానాల్లో ఈరోజే పోలింగ్ జరగనున్నది. ఈ క్రమంలో రెండో దశ పోలింగ్ కీలకంగా మారింది.

ఇప్పటికే తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగగా 65.5 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అయితే, రెండో దశ పోలింగ్ లో ఓటర్లు ఎంతమేరకు పోలింగ్ శాతాన్ని పెంచుతారో అనేది ఈరోజు తేలిపోనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News