Big Stories

Kukatpally Crime : కూకట్ పల్లి హత్యాచారం కేసులో పురోగతి.. నిందితులు అరెస్ట్

Kukatpally Crime : కూకట్ పల్లి పీఎస్ పరిధిలో.. చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే మహిళపై ఈ నెల 20వ తేదీన అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 45 కిలోమీటర్లలో ఉన్న 1400 సీసీ కెమెరాలను జల్లెడపట్టి.. నిందితుడి బైక్ నంబర్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన విషయాలు మీడియా ఎదుట వెల్లడించారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన 45 ఏళ్ల మహిళ.. భర్త చనిపోవడంతో హైదరాబాద్ కు వచ్చి ఒంటరిగా జీవిస్తోంది. మూసాపేట వై జంక్షన్లో ఉన్న ఒక వెహికల్ షోరూమ్ లో స్వీపర్ గా పనిచేస్తూ, చిత్తుకాగితాలు ఏరుకుని వాటిని అమ్మి సంపాదించిన డబ్బుతో జీవనం సాగిస్తోంది. మరోవైపు బిహార్ కు చెందిన 24 ఏళ్ల నితీశ్ కుమార్ దేవ్, మరో బాలుడు సంగారెడ్డిలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. వీరిద్దరికీ ప్రతిరోజూ తాగడమే పని.

- Advertisement -

Also Read : మూసాపేట్ లో దారుణం.. భిక్షాటన చేసే మహిళపై రెచ్చిపోయిన కామాంధులు!

ఏప్రిల్ 20న తన ఫ్రెండ్ ను కలిసేందుకు బైక్ పై ప్యారడైజ్ కు వెళ్లి.. తిరిగి సంగారెడ్డి వెళ్తూ.. ప్రశాంత్ నగర్ లో టీ తాగేందుకు ఆగి ఉన్నారు. ఆ సమయంలోనే బాధిత మహిళ ఒంటరిగా కనిపించడంతో.. ఆమెను ఫాలో అయ్యారు. నిర్మానుష్యం భవనం వద్దకు వెళ్లగానే.. సెల్లార్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అంతటితో ఊరుకోక.. పారిపోతున్న మహిళను పట్టుకుని తల నేలకేసి కొట్టి చంపి.. పరారయ్యారు. నిందితుల కోసం నగరమంతా జల్లెడ పట్టిన పోలీసులు.. వారి నుంచి బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News