BigTV English

Indian Navy: టార్పిడో టెస్ట్ సక్సెస్.. సముద్రంలో చైనాకు చెక్!

Indian Navy: టార్పిడో టెస్ట్ సక్సెస్.. సముద్రంలో చైనాకు చెక్!
indian navy

Indian navy latest update(Today’s breaking news in India): భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో కొత్త అస్త్రం చేరనుంది. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ విజయవంతంగా పరీక్షించింది. నీటిలోపల లక్ష్యాల్ని ఈ టార్పిడో ఛేదించింది.


సముద్ర అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల తయారీ కోసం నేవీ, డీఆర్‌డీవో చేతులు కలిపాయి. ఈ క్రమంలో భారీ టార్పిడోను అభివృద్ధి చేశాయి. ఈ హెవీ వెయిట్‌ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశామని నేవీ ప్రకటించింది. ఆత్మనిర్భరతకు ఇది నిదర్శనం అన్నారు. ఈ టార్పిడో పేరు, ఫీచర్లను నౌకాదళం పూర్తిస్థాయిలో బయటపెట్టలేదు.

హిందూ మహా సముద్రంలో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇండియన్ నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇప్పటికే భారత నౌకాదళంలో వరుణాస్త్ర అనే భారీ టార్పిడో ఉంది. నీటి అడుగు నుంచి క్షిపణిని ప్రయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి శత్రునౌకల పైకి ఈ టార్పిడోను ప్రయోగిస్తారు. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ ఈ టార్పిడోను అభివృద్ధి చేసింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×