E-Paper
Advertisement

Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాన్ని తెలుసుకునే కొత్త టెక్నిక్..

Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాన్ని తెలుసుకునే కొత్త టెక్నిక్..
Advertisement

Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ఎప్పుడు, ఎవరికి, ఎందుకు వస్తుందో ఎవ్వరం చెప్పలేము. కాలేజ్‌కు వెళ్లే విద్యార్థుల దగ్గర నుండి రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలనుకునే వ్యక్తి వరకు.. హార్ట్ ఎటాక్ అనేది ఎవరికి వస్తుందో అంచనా వేయడం కష్టంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం వృద్ధులు మాత్రమే గుండెపోటుకు గురవుతారు అని అనుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. అందుకే హార్ట్ ఎటాక్ గురించి పూర్తిస్థాయిలో స్టడీ చేయాల్సిన సమయం వచ్చేసింది.

Advertisement

అస్థిరోస్లెరోసిస్ అనే మెడికల్ కండీషన్ వల్ల హార్ట్ ఎటాక్ అనేది వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది గుండెలోని ఆర్టెరీస్ భాగంలో ప్లేక్ చేరుకోవడం వల్ల కలుగుతుందని వారు తెలిపారు. కానీ ఈ ప్లేక్ గురించి ఏ బ్లడ్ టెస్ట్‌లో కానీ, కొలెస్ట్రాల్ టెస్ట్‌లో కానీ బయటపడదని వారు అంటున్నారు. అందుకే అస్టిరోస్లెరోసిస్ గురించి, ఆర్టెరీస్‌లో చేరుకునే ప్లేక్ గురించి తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదే మైక్రో ఆర్ఎన్ఏ. ఆరేళ్ల పాటు స్టడీ చేసిన తర్వాత ఆర్ఎన్ఏ అనేది హార్ట్ ఎటాక్ అవకాశాన్ని గుర్తించగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మైక్రో ఆర్ఎన్ఏ అనేది ఆర్టెరీస్‌లో ప్లేక్ చేరుకోవడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కేవలం గుండెపోటు విషయంలోనే కాదు.. మైక్రో ఆర్ఎన్ఏపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా గుండెకు సంబంధించిన ఎన్నో వ్యాధుల గురించి తెలుసుకోవచ్చని వారు తెలిపారు. ముందుగా వారు ఎలుకల్లో మైక్రో ఆర్ఎన్ఏ ప్రభావాన్ని గమనించి చూశారు. ఈ క్రమంలో ఆర్ఎన్ఏ అనేది గుండెకు సంబంధించిన వ్యాధులను, గుండెపోటు అవకాశాన్ని గుర్తించడంలో మెరుగ్గా పనిచేస్తుందని కనిపెట్టారు.

Advertisement

ఒక మైక్రో ఆర్ఎన్ఏ అనేది దాదాపు మరో 40 ఆర్ఎన్ఏలతో కలిసినప్పుడు మనిషిలో గుండెకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే రెండు రకాల ఎలుకలపై తాము స్టడీ చేశామని, అప్పుడే ఈ విషయంలో ఒక నిర్ధారణకు వచ్చామని వారు తెలిపారు. మైక్రో ఆర్ఎన్ఏ అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల గుండెలో ప్లేక్ అనేది ఫార్మ్ అవుతుందని వారు గమనించారు. అందుకే ఇప్పటినుండి గుండెపోటు అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా మైక్రో ఆర్ఎన్ఏ టెస్ట్ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×