E-Paper
Advertisement

జపాన్‌లో భారీ భూకంపం.. ఒక్కసారిగా నిలిచిన రైళ్లు!

జపాన్‌లో భారీ భూకంపం.. ఒక్కసారిగా నిలిచిన రైళ్లు!
Advertisement

Japan Earthquake Disrupts Rail Services:  జపాన్‌లో మరోసారి భారీ భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన బలమైన ప్రకంపనలతో టోక్యో, చుట్టుపక్కల ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రకంపనలు వచ్చిన వెంటనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైలు సర్వీసులను నిలిపివేశారు.

పలు రైలు సర్వీసులు నిలిపివేత

భూకంపం ప్రభావం రైల్వే వ్యవస్థపై స్పష్టంగా కనిపించింది. ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ పలు మార్గాల్లో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. జోబాన్, ఉత్సునోమియా, తకాసాకి, కీహిన్-తోహోకు, ముసాషినో లైన్లలోని కొన్ని ప్రాంతాల్లో సర్వీసులను ఆపివేశారు. భూకంపం తర్వాత రైల్వే అధికారులు ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించాల్సి వచ్చింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రైళ్ల రాకపోకలను కొనసాగించారు. దీంతో ఉదయం వేళ ప్రయాణాలు చేయాల్సిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విమానాశ్రయాలకు వెళ్లే రైళ్లపైనా ప్రభావం

Advertisement

భూకంపం ప్రభావం కేవలం స్థానిక రైళ్లకే పరిమితం కాలేదు. టోక్యో, నరిటా విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్లో కూడా ఆలస్యం ఏర్పడింది. ఈశాన్య ప్రాంతాల్లో నడిచే కొన్ని లోకల్ రైలు సర్వీసులు కూడా ఆలస్యంగా నడిచినట్లు అధికారులు తెలిపారు. ఉదయం ప్రయాణ సమయం కావడంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా రైళ్లు ఆగిపోవడంతో తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది.

షింకన్సెన్‌ పై నో ఎఫెక్ట్   

అయితే జపాన్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే షింకన్సెన్ బుల్లెట్ రైళ్లకు మాత్రం ఈ భూకంపం వల్ల పెద్దగా అంతరాయం ఏర్పడలేదు. అవి యథావిధిగా నడుస్తున్నాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. జపాన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. అందుకే అక్కడ రైల్వే వ్యవస్థలో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ప్రకంపనలు గుర్తించిన వెంటనే రైళ్లను నిలిపివేయడం, మార్గాలను తనిఖీ చేయడం వంటి చర్యలు సాధారణంగా చేపడతారు.

రవాణా వ్యవస్థపై ప్రకంపనల ప్రభావం

Advertisement

భూకంపం కారణంగా రైళ్లతో పాటు ఆ ప్రాంతంలోని ఇతర రవాణా సేవలపైనా ప్రభావం పడింది. బలమైన ప్రకంపనల తర్వాత రోడ్డు మార్గాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడైనా రోడ్లు, వంతెనలపై వెళ్లేందుకు కాస్త భయపడ్డారు.  అధికారుల తనిఖీల తర్వాత రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జపాన్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టడం సాధారణంగా కనిపిస్తుంది.

ఇటీవలే భారీ భూకంపం

కొన్ని వారాల ముందు జపాన్‌లోని అత్యంత దక్షిణ ప్రధాన ద్వీపం క్యూషులోని కుమామోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ విపత్తు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 38 మంది ప్రాణాలు కోల్పోగా, 364 మంది గాయపడ్డారు. 1,500కు పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 20 వేల వరకు భవనాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాజా భూకంపం కూడా జపాన్ ప్రజల్లో ఆందోళన కలిగించింది. ప్రకంపనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: డీజిల్‌కు గుడ్‌బై.. భారత్‌లో 35 హైడ్రోజన్ రైళ్లు.. వామ్మో.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

Tags

Related News

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

Big Stories

Advertisement
×