BigTV English

Big Fight in Amethi Elections: మరోసారి బిగ్ ఫైట్.. రాహుల్ Vs స్మృతి.. పైచేయి ఎవరిది?

Big Fight in Amethi Elections: మరోసారి బిగ్ ఫైట్.. రాహుల్ Vs స్మృతి.. పైచేయి ఎవరిది?

Rahul Gandhi Vs Smriti Irani in Amethi Elections 2024: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకుగానీ అక్కడి ఓటర్లు తీర్పు వెరైటీగా ఉంటుంది. తాజాగా అమేథి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈసారి రాబర్ట్‌వాద్రాకు ఛాన్స్ ఇస్తారనే వార్తలూ లేకపోలేదు. చివరకు అమేథి నుంచి రాహుల్‌గాంధీ బరిలోకి దిగుతున్నారు.


శుక్రవారంతో అమేథిలో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో రేపు నామినేషన్ వేయనున్నారు రాహుల్‌గాంధీ. ఇప్పటికే ఆయన కేరళ‌లోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నుంచి ఈసారి కూడా బీజేపీ తరపున కేంద్రమంత్రి స్మృతిఇరానీ బరిలో ఉన్నారు. దీంతో రాహుల్ వర్సెస్ స్మృతి‌ఇరానీ మధ్య గట్టి ఫైట్ నెలకొనడం ఖాయమని అంటున్నారు.

Also Read: వారణాసిలో మూడోసారి, మోదీతో కమెడియన్ శ్యామ్ ఢీ


ఈ సీటుకు కాంగ్రెస్‌కు కంచుకోట. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు కూడా. అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. 2019 ఎన్నికల్లో మోదీ పవనాలు బలంగా వీయడంతో అక్కడి నుంచి ఇరానీ గెలిచారు. ఈసారి కష్టమన్నది అక్కడి ప్రజల భావన. ఇందుకు కారణాలు లేకపోలేదు.

గడిచిన ఐదేళ్లలో ఆ నియోజకవర్గానికి ఆమె వెళ్లింది చాలా తక్కువని అంటున్నారు. ఒకవేళ వచ్చినా పార్టీ నాయకులతో మాట్లాడి వెళ్లిపోవడం తప్ప, అక్కడి ప్రజలకు ఒదిగిందేమీ లేదని చెబుతున్నారు. మోదీ ప్రచారం, సీఎం యోగి ఛరిష్మా మీదే ఆమె ఆధారపడినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మహా అంటే రెండుమూడు సార్లు అక్కడ పర్యటించినట్టు చెబుతున్నారు. ప్రత్యర్థి ఎవరో తెలియక ప్రచారానికి కూడా ఆమె దూరంగా ఉన్నారన్న వార్తలు లేకపోలేదు.

Also Read: EC transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ

గతంలో రాహుల్‌గాంధీ అమేథీలో ఓడిపోయారన్న సింపథీ ఉంది. దీనికితోటు రిజర్వేజన్ల వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా హీట్ క్రియేట్ చేసింది. సో.. అక్కడ రాహుల్‌గాంధీ ఈసారి గెలవడం ఖాయమని అక్కడి రాజకీయ నేతలు చెబుతున్నమాట. మరి గెలుపెవరిదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు మరి!

Tags

Related News

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Big Stories

×