Big Stories

Comedian Shyam Contest Varanasi: వారణాసిలో మూడోసారి మోదీతో కమెడియన్ శ్యామ్ ఢీ

Comedian Shyam Contest from Varanasi Against PM Modi: ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో నామినేషన్‌ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల 13న ఏపీ, తెలంగాణలో పోలింగ్ రోజున ప్రధాని మోదీ అక్కడ తన నామినేషన్ వేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈసారి హ్యాట్రిక్ ఖాయమన్నది కమలనాధులు చెబుతున్నమాట.

- Advertisement -

అంతకుముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శిస్తారు ప్రధాని. వారణాసిలో చివరి విడత పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. దీనికి సంబంధించి మే ఏడున నోటిఫికేషన్ వెలువడనుంది. నామనేషన్ల సమర్పణకు గడువు 14 వరకు ఉంది. 13న ప్రధాని నామినేషన్ వేయనున్నారు. ఈసారి మోదీ ప్రత్యర్థిగా పూర్వాంచల్ బాహుబలి నేతగా పేరుపొందిన, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ వరసగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -

మరోవైపు వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీపై కమెడియన్ శ్యామ్ రంగీలా పోటీకి దిగుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ హాస్యనటుడు.. రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. 29 ఏళ్ల ఎంటర్‌టైనర్ వారణాసి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ప్రధానిపై పోటీ చేయాలని నిర్ణయించుకోవడం స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగిపోయింది. ప్రజాస్వామ్యం జీవించే ఉందని చెప్పడానికే తాను ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: వడగళ్లకు దెబ్బతిన్న ఫ్లైట్.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి వీల్లేదని చెబుతూనే ఎప్పుడైనా నామినేషన్ విత్ డ్రా చేసుకునే అవకాశముందని అంటున్నారు. ఈ లెక్కన శ్యామ్ పోటీ చేయడం డౌటేనని అనుకుంటున్నారు. ప్రధాని మోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాదించిన శ్యామ్ రంగీలా, తన మద్దతు దారులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News