
Ballari: రాజకీయాల్లో రాణించాలంటే అంత ఈజీ కాదు. ఎంతో అనుభవం ఉండాలి. కానీ కేరళలో ఓ యువతి 23 ఏళ్లకే ఓ నగరానికి మేయర్ అయ్యింది. అతి చిన్న వయస్సులోనే మేయర్ అయి రికార్డ్ సృష్టించింది. కర్ణాటకలోని బళ్లారికి చెందిన డి.త్రివేణి ఫార్మసీలో దిప్లొమా పూర్తి చేసింది. తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉండడంతో.. తనకు కూడా రాజకీయాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచే కోరిక ఉంది.
ఈక్రమంలో 18 ఏళ్ల వయస్సులోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది త్రివేణి. కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాలుగో వార్డ్ నుంచి కార్పోరేటర్‌గా విజయం సాధించింది. అలాగే బుధవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. ఏడాది పాటు బళ్లారి మేయర్‌గా కొనసాగనుంది.
ఇక 23 ఏళ్ల వయస్సుకే కార్పొరేటర్ అవ్వడంతో త్రివేణి పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించడం పట్ల త్రివేణి కూడా సంతోషం వ్యక్తం చేసింది. కార్పోరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చింది త్రివేణి.