BigTV English

2 Years Old Boy Rescued form Borewell: 20 గంటల రెస్క్యూ ఆపరేషన్‌.. బోరుబావిలో పడిన బాలుడు సేఫ్..!

2 Years Old Boy Rescued form Borewell: 20 గంటల రెస్క్యూ ఆపరేషన్‌.. బోరుబావిలో పడిన బాలుడు సేఫ్..!
Karnataka
Karnataka

2 Year Old Boy Rescued from 16 Feet Deep Borewell: ఆ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. ఈ సమాచారం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 20 గంటలపాటు శ్రమించాయి. ఆ ప్రయత్నాలు ఫలించాయి. బాలుడిని రక్షించారు. సురక్షితంగా బయటకు తీశారు.


కర్ణాటకలోని విజయపుర జిల్లా లచయానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ముజగొండ సతీశ్ అనే రైతు పొలంలో బోరు బావి తవ్వించాడు. బుధవారం సాయంత్రం సమయంలో సతీశ్ ఏడాదిన్నర వయస్సు కొడుకు సాత్విక్ అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బోరు బావిలో పడిపోయాడు.

బాలుడు బోరు బావిలో పడిన సమాచారం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించాయి. చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఆ బాలుడు 16 అడుగల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందించారు. 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత సాత్విక్ ను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.


Also Read: ఒకవైపు నీటి సంక్షోభం.. మరోవైపు కలరా కలవరం.. ఈ నగరానికి ఏమైంది ?

సాత్విక్ ను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. సాత్విక్ క్షేమంగా బయటపడ్డాడు. తల్లితండ్రులతోపాటు గ్రామస్థులు సంతోషం వ్యక్తంచేశారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×