Big Stories

Udhayanidhi stalin : కేబినెట్ లోకి స్టాలిన్ వారసుడు.. ఉదయనిధికి క్రీడలశాఖ బాధ్యతలు..

Udhayanidhi stalin : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వారుసుడికి కేబినెట్ లో స్థానం దక్కింది. డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ బుధవారం ఉదయం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ఉదయనిధితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌, కేబినెట్‌ మంత్రులు హాజరయ్యారు. ఉదయనిధికి క్రీడల శాఖ బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

స్టాలిన్‌ వారసుడిగా ఉదయనిధి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో డీఎంకే యువజన విభాగానికి అధ్యక్షుడయ్యారు. గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ప్రచార బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తిరిగారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయలో విమర్శలు చేసి జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. గతంలో ఈ నియోజకవర్గానికి ఆయన తాత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -

కరుణానిధి మరణం తర్వాత 2018లో స్టాలిన్‌ డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు, ఆయన పార్టీ యువజన విభాగానికి 3 దశాబ్దాలపాటు నాయకత్వం వహించారు. స్టాలిన్‌ పార్టీ అధ్యక్షుడైన తర్వాత.. యూత్‌ వింగ్‌ను ఉదయనిధికి అప్పగించారు. ఇలా తాత వారసత్వాన్ని తండ్రి అందుకుంటే..ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని ఉదయనిధి కొనసాగిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగానూ రాణించారు. ఉదయనిధి నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొద్ది నెలల క్రితమే నిర్ణయించారు. కొన్ని సినిమాల ఒప్పందాల కారణంగా ఆలస్యమైనట్లు వార్తలు వచ్చాయి.

మరోవైపు ఉదయనిధిని కేబినెట్‌లోకి తీసుకోవడంపై ప్రతిపక్ష అన్నాడీఎంకే విమర్శలు చేస్తోంది. వారసత్వ రాజకీయాలకు డీఎంకే స్వస్తి పలకాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News