BigTV English

Free Aadhaar Update: ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌.. గడువు పొడిగింపు

Free Aadhaar Update: ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌..  గడువు పొడిగింపు

Free Aadhaar Update


Free Aadhaar Update: ఆధార్ ఉచితంగా అప్ డేట్ గడువును యూఐడీఏఐ మరోసారి పెంచింది. ఈ గడువు మార్చి 14తో ముగిసింది. అయితే మరో 3 నెలలు ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ ఎక్స్ లో ట్వీట్ చేసింది. జూన్ 14 వరకు ఆధార్ వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది.

ఆధార్ ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు తొలుత 2023 మార్చి 15 వరకు గడువు ఇచ్చారు. అయితే ఈ గడువును తర్వాత 2023 డిసెంబర్ 14 వరకు పొడిగించారు. అనంతరం మరోసారి గడువు 2024 మార్చి 14 వరకు పెంచారు. తాజాగా ఈ గడువు ముగియనుండటంతో మరోసారి పొడిగించారు.


ఆధార్ వివరాలు నమోదు చేసుకుని 10 ఏళ్లు పూర్తైయితే వారు కచ్చితంగా అప్ డేట్ చేసుకోవాలి. తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేయాలి. యూఐడీఏఐ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. లేటెస్ట్ గుర్తింపు కార్డు, చిరునామా వివరాలు ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ లాంటివి ఐడెెంటిటీ, అడ్రెస్ ధ్రువీకరణ పత్రాలుగా సమర్పించవచ్చు.

Also Read: 10 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. సికింద్రాబాద్ – విశాఖ మార్గంలో పట్టాలెక్కిన ట్రైన్

పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, టీసీ, మార్క్ షీట్లు గుర్తింపు ధ్రువీకరణకు ఉపయోగపడతాయి. అలాగే కరెంట్ , వాటర్ ,గ్యాస్ , టెలిఫోన్ బిల్లులను అడ్రస్ ధ్రువీకరణకు ఉపయోగించకోవచ్చు. మై ఆధార్‌ పోర్టల్‌ లోనే ఉచిత సర్వీసు అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Ayodhya: అయోధ్యలో మరో కీలక ఘట్టం.. బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Big Stories

×