BigTV English

Bihar Bridge Collapses: బీహార్‌లో కూలిన మరో వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి

Bihar Bridge Collapses: బీహార్‌లో కూలిన మరో వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి

Bridge Collapses in Bihar(Today news paper telugu): బీహార్‌లో వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. అవి పేకమేడల్లా కూలిపోతుండటం చూసి.. జనం విస్తుపోతున్నారు. తాజాగా బీహార్‌లో గంగానదిపై నిర్మిస్తున్న మరో వంతెన కూలిపోయింది. ఒకసారి కాదు. రెండుసార్లు కాదు.. మూడోసారి ఈ వంతెన కూలిపోవడంతో, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బీహార్‌లో గంగానదిపై తొమ్మిదేళ్ల కిందట బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. నితీశ్ కుమార్ కలల ప్రాజెక్ట్ గా చెప్పుకొనే గంగానదిపై నిర్మిస్తున్న తీగల ప్రాజెక్ట్ కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అప్పట్లో 17 వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు మొదలెట్టారు. అయితే పూర్తి కావడానికి ముందే ఇది మూడుసార్లు కూలిపోయింది. అది కూడా రెండేళ్ల వ్యవధిలోనే. అత్యంత నాసిరకంగా పనులు చేస్తుండటం వల్లే బ్రిడ్జి కూలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌ను.. ఖగారియా జిల్లాలోని అగువానీ ఘాట్‌తో అనుసంధానించడానికి ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. వంతెన పూర్తయితే భాగల్‌పూర్ నుండి జార్ఖండ్‌కు సులభంగా ప్రయాణించవచ్చు. కానీ, వరుసగా బ్రిడ్జి కూలిపోతుండటంతో… ఇప్పట్లో ఇది పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.


Also Read: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు

బీహార్‌లో రోడ్ల నిర్మాణానికి, కేంద్రం ఇటీవలి బడ్జెట్లో 26 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. ఇప్పుడు జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం… అవి కూలిపోతున్న ఘటనలు చూస్తుంటే… ఇంత భారీ మొత్తం వెచ్చించినా.. అక్కడ పనులు సజావుగా సాగి, నాణ్యమైన నిర్మాణాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×