BigTV English

Actress Sreeleela: నాట్యం చేస్తుండగా నడుం పట్టేసిన అమ్మాయికి శ్రీలీల ఏం ఇచ్చిందో తెలుసా?

Actress Sreeleela: నాట్యం చేస్తుండగా నడుం పట్టేసిన అమ్మాయికి శ్రీలీల ఏం ఇచ్చిందో తెలుసా?

Sreeleela back pain commercial ad viral(Today tollywood news): కె.రాఘవేంద్రరావు స్కూల్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన బ్యూటీలు ఏ రేంజ్ లో పేరు సంపాదించుకున్నారో తెలుసుకదా..రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్లను ప్రత్యేకంగా చూపిస్తుంటారు. అందం, గ్లామర్, డ్రెస్సింగ్,మేకప్ ఇలా అన్ని విషయాలలోనూ కేర్ తీసుకుంటారు రాఘవేంద్రరావు. ఒకప్పటి శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి తారలంతా రాఘవేంద్రరావు సినిమాల ద్వారానే పాపులారిటీ సంపాదించుకున్నారు. అవన్నీ పక్కనపెడితే టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కూడా పెళ్లి సంద..డి సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కమర్షియల్ గా ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా శ్రీలీలకు మాత్రం అగ్ర హీరోలతో అవకాశాలు వచ్చిపడేలా చేసింది. శ్రీలీల డ్యాన్సులకు యూత్ లో మంచి క్రేుజ్ ఉంది. ఒక్కోసారి హీరోలను కూడా తన డ్యాన్సులతో డామినేట్ చేస్తుంటుంది శ్రీలీల.


చైల్డ్ ఆర్టిస్టుగా..

అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ బ్యూటీకి సరైన సినిమా పడలేదు. జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టే సినిమాలో చేయాలని ఉందని అంటోంది ఈ బ్యూటీ. 2017లోనే ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. 2019లో వచ్చిన కన్నడ మూవీ కిస్ లో హీరోయిన్ గా నటించింది. అయితే 2021లో తెలుగు సినిమా పెళ్లి సంద..డి చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంటనే రవితేజతో ధమాకా చేసింది. మహేష్ బాబుతో గుంటూరు కారం లో నటించింది. బాలకృష్ణ కూతురుగా భగవత్ కేసరి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. బాలకృష్ణ కూడా శ్రీలీలకు బంగారు భవిష్యత్తు ఉందని అభినందించారు.


షార్ట్ టైమ్ లోనే

శ్రీలీల వచ్చిన షార్ట్ టైమ్ లోనే మంచి స్పార్క్ ఉన్న నటిగా కొనియాడబడుతోంది. కెరీర్ లో కొన్ని అపజయాలు కూడా ఎదురుచూచింది. అందరూ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేయాలని సూచిస్తున్నారు. కొన్నికమర్షియల్ యాడ్స్ లోనూ నటిస్తోంది. ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి ఈ బ్యూటీకి. తాజాగా శ్రీలీల నటించిన ఓ కమర్షియల్ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది.శాస్త్రీయ నృత్యంలోనూ మంచి ప్రవేశం ఉన్న శ్రీలీల ఓ శాస్త్రీయ నృత్యం చేసే భామగా నర్తిస్తూ నటించింది.అయితే ఆమెతో పాటు మరో అమ్మాయి కూడా నాట్యం చేస్తూ నడుం నెప్పి వచ్చిన ఆ భామకు శాస్త్రి బామ్ తెచ్చి ఇస్తుంది. అయితే ఇది లేటెస్ట్ గా శ్రీలీల చేసిన కమర్షియల్ యాడ్. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీలీల.

ట్రెడిషనల్ లుక్ లో..

శ్రీలీల ఇలాంటి సంప్రదాయ యాడ్స్ కూడా చేస్తుందా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీలీలకు మరిన్ని అవకాశాలు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా శ్రీలీలను ఈ యాంగిల్ లో చూడలేదని..ట్రెడిషనల్ లుక్కులో చాలా బాగుందని అంటున్నారు. శంకరాభరణం లాంటి నృత్య ప్రధాన చిత్రంలో శ్రీలీల నటిస్తే చూడాలని ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తాను నటించిన ఓ కమర్షియల్ యాడ్ కు ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని తెగ సంబరపడిపోతోంది శ్రీలీల.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×