Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇంతకీ ఈ కారిడార్ దేనికి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమా? అవుననే సంకేతాలు ఆయా రంగాల నిపుణులు.
నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్
ఆదివారం కేంద్రమంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారిడార్‌ని కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఆ రాష్ట్రాలను ఎంపిక చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
ఆయా రాష్ట్రాల్లో ఖనిజాలు వెలికితీత, మైనింగ్ చేయడం, శుద్ధి చేయడం, ఆయా ఖనిజాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ కారిడార్ వెనుక అసలు ఉద్దేశం సెమీ కండక్టర్ పరిశ్రమకు ఊతం ఇవ్వనున్నట్లు పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఈవీలు, ఏరో స్పేస్, రక్షణ రంగాల్లో ఉపయోగించేవాటిలో భూమిపై లభించే రేర్ ఖనిజాలను వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి చైనా నుంచి దిగుమతులు చేసుకుంటోంది భారత్.
యువతకు ఉపాధి.. దిగుమతులు తగ్గించుకోవడం లక్ష్యం
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే 17 రకాల అరుదైన మూలకాలు. స్మార్ట్‌ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, క్షిపణుల తయారీకి ఉపయోగపడతాయి. గ్రీన్ ఎనర్జీకి వాడే విండ్ టర్బైన్ల వరకు ప్రతి చోటా ఆయా ఖనిజాలు అవసరం. ఆయా ఖనిజాల సరఫరాలో చైనా 90 శాతం ఆధిపత్యం ఉంది. చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవడం కోసం ఈ కారిడార్ల ప్రధాన ఉద్దేశం.
దేశానికి సుమారు 7 వేల కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిషా తీరాల్లోని బీచ్ ఇసుకలో మోనాజైట్, ఇల్మేనైట్ వంటి అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రేర్ మినరల్ క్లస్టర్ హబ్‌గా మార్చాలని భావిస్తోంది కేంద్రం. కన్యాకుమారి నుండి తూత్తుకుడి తీరప్రాంతాల్లో అరుదైన ఖనిజం ఉంది.
ALSO READ: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం
వీటిని వెలికితీసి, శుద్ధి చేయడానికి ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనుంది. కేరళలో మోనాజైట్ ఇసుకలో థోరియం ఎక్కువగా ఉందని గుర్తించారు. 2025లో ప్రారంభించిన ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ స్కీమ్‌కు ఇది కొనసాగింపు. దీంతోపాటు ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు ఆర్థికమంత్రి.
దీంతోపాటు ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు ఆర్థికమంత్రి. ఈ కారిడార్ ద్వారా ఖనిజాలను వెలికితీయడమే కాదు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగు రాష్ట్రాల్లో లక్ష మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది కేంద్రం అంచనా. మొత్తానికి ఏపీ, కేరళ, ఒడిషా, తమిళనాడులో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ కారిడార్లు దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.