BigTV English

Dharmendra Pradhan: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

Dharmendra Pradhan: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

Dharmendra Pradhan Called Off his Event: ఇంటర్నేషనల్ యోగా డే రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. యోగా డే వేడుకు ఢిల్లీ యూనివర్శిటీకి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలపడంతో వేడుక రద్దు చేసుకుని వెనుదిరిగారు.


యోగా డే సందర్భంగా ఢిల్లీ యూనివర్శిటీలోని వేడుకలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరవ్వడానికి వస్తుండగా విద్యార్థులు ఆయనకు నల్ల జెండాలు ప్రదర్శించారు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్‌కు సంబంధించిన ఇటీవలి కుంభకోణాలపై వారు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో చేసేదేమిలేక మంత్రి వెనుదిరిగారు.

కాగా గురువారం ధర్మేంద్ర ప్రధాన్ యూజీసీ నెట్ పేపర్ లీకేజీ అంశంపై స్పందించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థాగత వైఫల్యంగా పేర్కొన్నారు. ఎన్టీయే పనితీరును పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. అలాగే వ్వవస్థలో అవసరమయ్యే సంస్కరణలను సిఫార్సు చేస్తుందని అన్నారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, యూజీసీ-నెట్ రద్దుపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.


Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×