Big Stories

Railway Minister : ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ : రావ్ సాహెబ్ దన్వే

Railway Minister : రైల్వే సహాయమంత్రి రావ్‌సాహెబ్ దన్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయన్నారు. కేవలం ప్రజల సౌకర్యార్ధం కోసం మాత్రమే రైల్వే ప్యాసింజర్ ట్రైన్లు నడుపుతున్నట్లు చెప్పారు. ప్యాసంజర్ రైల్‌లో పెట్టిన ప్రతీ రూపాయిపై రూ.55 పైసలు అధికంగా ఇండియన్ రైల్వేలపై భారం పడుతుందన్నారు.

ప్యాసింజర్ ట్రైన్స్ వల్ల వచ్చిన నష్టాలను గూడ్స్ ట్రైన్స్‌తో భర్తీ చేస్తున్నామన్నారు. బీహార్లోని ఛాప్రా నుంచి మహారాష్ట్ర జల్నా వరకు వీక్లీ స్పెషల్ ట్రైన్‌ను స్టార్ట్ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ ట్రైన్స్ వల్ల నష్టాలు వచ్చినా.. కేవలం ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ ప్యాసింజర్ ట్రైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తాజాగా జల్నా, ఛాప్రా మధ్య ప్రారంభించిన వీక్లీ ట్రైన్ మరాఠా ప్రజల చిరకాల కోరిక అని అన్నారు రైల్వే సహాయమంత్రి రావ్‌సాహెబ్ దన్వే.

ఇవి కూడా చదవండి

Latest News