Big Stories

Kedarnath Temple : కేదార్‌నాథ్ ఆలయం ఆరు నెలలపాటు మూసివేత..

Kedarnath Temple : కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు మూసివేశారు. శీతాకాలం కావడం, మంచు బాగా కురుస్తుండ్డంతో ఆలయాన్ని మరో ఆరు నెలలపాటు మూసివేయనున్నరు. మూసివేసే ముందు ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. ఈ పూజలో సుమారు 3వేల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్రలో 43 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 15 లక్షల మంది కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. యమునోత్రి ఆలయాన్ని గురువారం రోజు మూసివేయగా.. గంగోత్రి ఆలయాన్ని బుధవారమ్ మూసివేశారు.

- Advertisement -

బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేయనున్నారు. శీతాకాలం కావడంతో కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోతాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News