BigTV English

Uttar Pradesh News: భార్య‌కు ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌, అసలేం జరిగిందంటే..

Uttar Pradesh News: భార్య‌కు ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌, అసలేం జరిగిందంటే..

Uttar Pradesh News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని భావించారు.  ప్రేమను మనసులో గుడి కట్టేసింది.  ఫ్యామిలీతోపాటు పెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. అయినా ఆమెలో మార్పు రాలేదు.  తన భార్య ప్రేమ విషయం తెలియగానే భర్త షాకయ్యాడు. చివరకు ప్రేమించిన వ్యక్తికి భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..


అసలేం జరిగింది?

యూపీలోని సంత్ కబీర్ నగర్‌ జిల్లాలోని చిన్న గ్రామం. ఆ ప్రాంతానికి బబ్లూ అదే ప్రాంతానికి చెందిన రాధిక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. అంటే 2017లో బబ్లూ-రాధిక వివాహం జరిగింది. సొంతూరు పైగా పెద్దలు కుదుర్చుని పెళ్లి కావడంతో యువతి సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కట్టుబాట్లు ఉంటాయి.


బబ్లూ-రాధిక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ పోషణ నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి పని చేసేవాడు బబ్లూ.  సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీని నిర్లక్ష్యం చేశాడన్నది ఆ ప్రాంతవాసుల మాట. ఇదే సమయంలో రాధికకు సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వివాహేతర బంధానికి దారి తీసింది.

ఈ విషయం రాధిక అత్తమామలకు తెలిసింది. రాధిక యవ్వారాన్ని కొడుకు బబ్లూకు చెప్పారు. భార్య గురించి నిజం తెలుసుకున్న బబ్లూ, ఆమెని పల్లెత్తు మాట అనలేదు. ఆమె మనసు మార్చాలని భావించాడు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ రాధికలో ఏమాత్రం మార్పు రాలేదు.

ALSO READ: హిందువులు బాగుంటేనే.. ముస్లింలు బాగుంటారు

భార్యను మార్చేందుకు ప్రయత్నాలు

ఇక ఏమీ చేయలేక భార్య రిలేషన్ గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లూ. చివరకు వారంతా మందలించినా ఆమెలో ఎలాంటి మార్పు కనిపించలేదు. బబ్లూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. రాధకను ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహం చేయాలని డిసైడ్ అయ్యాడు. రాధికతోపాటు ఆమె లవర్‌ను ఇంటికి పిలిచి తన నిర్ణయాన్ని చెప్పాడు బబ్లూ.

తమ ప్రేమకు భర్త అడ్డు చెబుతాడని భావించింది రాధిక. అందుకు భిన్నంగా భర్త దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పడంతో రాధిక సంతోషానికి హద్దు లేకుండా పోయింది. గ్రామంలో ఓ దేవాలయంలోని ప్రేమించిన వాడ్ని వివాహం చేసుకుంది రాధిక.

భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన భర్త

బబ్లూ దగ్గరుండి తన భార్య చేయిని ప్రేమించిన వాడి చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా చూసుకోమని ఆశీర్వదించాడు. పిల్లల గురించి ఏమాత్రం బాధ పడవద్దని, తాను చూసుకుంటానని అన్నాడు బబ్లూ. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి. ఇలాంటి మనస్సు ప్రస్తుత ప్రపంచంలో ఎంతమందికి ఉంటుందో?

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×