Naga Vamsi: యూత్ టార్గెట్ వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘మ్యాడ్’ (Mad) మూవీకి సీక్వెల్‌గా రూపొందిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) రిలీజ్‌కు రెడీ అయింది. నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిచింన ఈ సినిమాకు.. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నాగవంశీ (Naga Vamsi) పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవిశ్రీ ప్రసాద్, బోనీ కపూర్ గొడవ పై స్పందించాడు.
జాన్వీతో సినిమా చేస్తే ఏ మొహం పెట్టుకోవాలి!
మామూలుగానే నాగవంశీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడు. ఏ విషయాన్నైనా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తాడు. ఆ మధ్య సౌత్, నార్త్ మీటింగ్ జరిగింది. అందులో.. బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో (Boney Kapoor) కలిసి నాగవంశీ కూడా పాల్గొన్నాడు. ఈ మీటింగ్‌లో నాగవంశీ, బోనీ కపూర్‌ను కించపరిచేలా మాట్లాడాడు, ఆటిట్యూడ్ చూపించాడు.. అంటూ బాలీవుడ్ సినీ వర్గాలు కాస్త మండిపడ్డాయి. నాగవంశీ కూడా వాళ్లకు అదిరిపోయే కౌంటర్స్ ఇచ్చాడు. ఈ ఇష్యూ గురించి నాగవంశీని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. అలాంటిదేమి లేదని చెప్పుకొచ్చాడు. బోణీ కపూర్‌తో గొడవ ఏమి లేదు. సౌత్ ఇండియన్ సినిమాలు బాగా ఆడుతున్నాయని అన్నాను. కానీ బోనీ కపూర్‌కు రెస్పెక్ట్ ఇవ్వలేదని, ఆయనను డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. అసలు.. ఈ మీటింగ్‌లో కూర్చున్న విధానం వేరు. అందుకే అలా అనిపించి ఉండొచ్చు. జాన్వీ కపూర్ ఫాదర్‌ని ఎవరైనా డిస్‌రెస్పెక్ట్ చేస్తారా. రేపు ఆయన కూతురు జాన్వీ కపూర్‌తో (Janhvi Kapoor) సినిమా చేస్తే ఏ మొహం పెట్టుకొని అడుగుతాం.. అని నాగవంశీ అన్నాడు.
దేవిశ్రీ ప్రసాద్‌తో గొడవ లేదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)తో గొడవ ఏంటి? ఆయనతో ఎందుకు సినిమాలు చేయడం లేదని అడగ్గా.. మా మధ్య గొడవ ఏం లేదని అన్నాడు. దేవిశ్రీ చెన్నైలో ఉంటాడు. సడెన్‌గా ఫోన్ చేసి.. దేవి ఒక సినిమాకు స్కోర్ చేయాలంటే.. ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అదే తమన్ అయితే.. చేసేద్దాం అంటాడు. తమన్ మా ఇంటి మనిషి.. మ్యాడ్ స్క్వేర్ కోసం పది రోజుల ముందు తమన్‌ను తీసుకున్నాం. కొన్ని సీన్లకు తమన్ (Thaman) అవసరం అనిపించి తీసుకున్నాం.. అంతే కాని భీమ్స్ బాగా చేలేదని కాదని అన్నాడు. ఫ్యూచర్లో దేవిశ్రీ ప్రసాద్‌తో తప్పకుండా సినిమా చేస్తాము. డాకు మహారాజ్ సినిమాకు దేవిని తీసుకోకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అది వేరే.. అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాడ్ స్క్వేర్ గురించి చెబుతూ.. ఇది మరో జాతి రత్నాలు అని చెప్పాడు. ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అన్నాడు. మరి మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుందో చూడాలి.