BigTV English

UPSC Civils 2024: ఎలక్షన్ ఎఫెక్ట్.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్స్ ఇవే..!

UPSC Civils 2024: ఎలక్షన్ ఎఫెక్ట్.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్స్ ఇవే..!

UPSC Civils 2024UPSC Civils 2024: ఎలక్షన్ ఎఫెక్ట్.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్స్ ఇవే..!
దేశంలోని సివిల్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు మే 26న జరగాల్సి ఉండగా యూపీఎస్సీ కొత్త తేదీలను విడుదల చేసింది.


మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ సివిల్స్, ఫారెస్ట్ సర్వీసు నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదల చేసింది. అయితే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్ష మే 26వ తేదీనా జరగుతుందని గతంలో ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్ష తేదీలను మార్చుతున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ రెండు పరీక్షలు జూన్ 16వ తేదీన నిర్వహించాలని యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అయితే మెయిన్స్ పరీక్ష తేదీల్లో ఎటువంటి మార్పు చేయలేదని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో యూపీఎస్సీ అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది.

Also Read: Bullet Train: 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు.. అందుబాటులోకి వచ్చేది ఆ రూట్ లోనే..!


ఫిబ్రవరి 14వ తేదీన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో 1,056 ఉద్యోగాలకు, ఫారెస్ట్ సర్వీసుల్లో 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు మార్చి 6వ తేదీతో ముగిసింది. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 19న నిర్వహించనున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన లక్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×