UPSC NDA 1 Result 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎట్టకేలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్ష 2024 ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాల ప్రకారం.. మొత్తం 7028 మంది అభ్యర్థులు మినిస్ట్రీ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. NDA1 పరీక్ష రాసిన వారు తమ ఫలితాలను upsc.gov.in అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. పేరు, రోల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
అర్హత సాధించిన విద్యార్థులు.. వ్రాతపూర్వక ఫలితాలు వెల్లడైన రెండు వారాల్లో ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ వెబ్ సైట్ joinindianarmy.nic.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు ఎంపిక కేంద్రాలు , ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తారు. ఈ వివరాలను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఒకసారి వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న అభ్యర్థి మళ్లీ నమోదు కావలసిన అవసరం లేదు.
SSB ఇంటర్వ్యూకి హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హత, సర్టిఫికేట్లను సంబంధిత బోర్డులకు సమర్పించాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లను యూపీఎస్సీకి పంపాల్సిన అవసరం లేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) SSB ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత తుది ఫలితాల మార్క్ షీట్లను 15 రోజుల్లో విడుదల చేస్తోంది.
153వ కోర్సు, 115వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (INAC) కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్‌లలో అడ్మిషన్లు 2 జనవరి 2025 నుండి ప్రారంభమవుతాయి.