BigTV English

Ilaiyaraaja Notice to Manjummel Boys Unit: ఇంకా దాహం తీరలేదా ఇళయరాజా.. రైట్స్ కొనుగోలు చేసినా నోటీసులు పంపించావా?

Ilaiyaraaja Notice to Manjummel Boys Unit: ఇంకా దాహం తీరలేదా ఇళయరాజా.. రైట్స్ కొనుగోలు చేసినా నోటీసులు పంపించావా?

Ilaiyaraaja Notice to Manjummel Boys Movie Unit: ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన మూవీ ఏదన్నా ఉందంటే అది ‘మంజుమ్మల్ బాయ్స్’ మాత్రమే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాకుండా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందనే ఆలోచనే ఎవ్వరిలో వచ్చి ఉండదు. అలాంటి అంచనాలు ఏవీ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ అందరి అంచనాలను తలకిందులు చేసింది.


ఇక తెలుగులో కూడా రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులను అలరించింది. అనంతరం ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా తన హవా చూపించింది. అయితే ఇంతటి ఘన విజయాన్ని, రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీ యూనిట్‌కి తాజాగా అనుకోని షాక్ తగిలింది. ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు ఇళయరాజా ఈ మూవీ చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించారు.

అయితే ఇలా నోటీసులు పంపించడం ఆయనకు ఇదేం కొత్త కాదు. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కూలి’ మూవీ ప్రొడ్యూసర్లకు లీగల్ నోటీసులు పంపించారు. ముందుగా తన అనుమతి లేకుండా తన మ్యూజిక్ ట్రాక్‌ని ఉపయోగించుకున్నారంటూ ఆయన ఆరోపించారు. అయితే అది మరువక ముందే ఇప్పుడు అదే రీజన్‌తో మంజుమ్మల్ బాయ్స్ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారు.


Also Read: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్‌కు షాక్.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నోటీసులు..

చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్ మూవీలో గతంలో కమల్ హాసన్ నటించిన ‘గుణ’లోని ఓ సాంగ్‌ను వాడుకున్నారు. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది అనే ఈ సాంగ్ మంజుమ్మల్ మూవీ ఫస్ట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్‌లో వస్తుంది. అయితే ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవని ఆయన తరపు లాయర్ లీగల్ నోటీసులు పంపించారు. దీని ప్రకారం.. ఈ పాటను ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే కొంత పరిహారాన్ని చెల్లించాలని.. లేదంటే కాపీరైట్స్‌ను ఉల్లంఘించినట్లుగా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఆ నోటీసులో పేర్కొన్నారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ‘గుణ’ సినిమా ఆడియో హక్కులను అప్పట్లో కొనుక్కున్న మ్యూజిక్ కంపెనీ నుంచి మంజుమ్మల్ బాయ్స్ మూవీ యూనిట్ అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆ మ్యూజిక్ హక్కులు కూడా కొనుక్కున్నారట. అంతేకాకుండా మూవీ స్టార్టింగ్‌లో ఇళయరాజా, కమల్ హాసన్‌కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ క్రెడిట్స్ కూడా ఇచ్చారు. ఇన్ని చేసినా ఇళయరాజా లీగల్ నోటీసులు పంపడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. మరి ఈ నోటీసులపై మంజుమ్మల్ బాయ్స్ మూవీ యూనిట్ స్పందిస్తుందా? లేదా అనేది చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×