E-Paper
Advertisement

అగ్రరాజ్యం అమెరికాలో బయటపడ్డ అసలు నిజాలు.. అల్లాడి పోతున్న సామాన్యులు!

అగ్రరాజ్యం అమెరికాలో బయటపడ్డ అసలు నిజాలు.. అల్లాడి పోతున్న సామాన్యులు!
Advertisement

US Household Debt: గత మూడేళ్లలో అమెరికన్ల సంపద పెరిగినట్లు పైకి కనిపిస్తున్నా.. అసలు వాస్తవాలు వేరేలా ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు అమెరికన్ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత.. సగటు కుటుంబ ఆదాయం 7 శాతం పెరిగింది. అయితే.. పెరిగిన సంపదలో ఎక్కువ భాగం అత్యంత ధనవంతులైన 10 శాతం మందికే చేరినట్లు నివేదిక చెబుతోంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చివరి 25 శాతం కుటుంబాల నికర ఆస్తి విలువ ఏకంగా 50 శాతానికి పైగా పడిపోయింది. అదే సమయంలో.. 75 ఏళ్లు పైబడిన ఉన్నత వర్గాల సంపద 37 శాతం పెరిగింది. అంటే.. ఒకవైపు సంపద పెరుగుతుంటే.. మరోవైపు దిగువ వర్గాల ఆస్తులు తగ్గుతున్నాయి.

 2025 నాటికి..

ఇక అప్పుల భారం కూడా అమెరికన్లను వెంటాడుతోంది. 2022లో రుణాల రీపేమెంట్లు చెల్లించని కుటుంబాలు 12 శాతం ఉండగా.. 2025 నాటికి ఆ సంఖ్య 20 శాతానికి చేరింది. అంటే.. మూడేళ్లలోనే EMIలు చెల్లించలేని కుటుంబాలు భారీగా పెరిగాయి. అంతేకాదు.. తమ ఆదాయంలో 40 శాతానికి పైగా కేవలం ఈఎంఐలకే ఖర్చు చేస్తున్న కుటుంబాల శాతం 8.6కి చేరింది. 2013 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మరోవైపు.. అవసరాలు తీర్చుకునేందుకు ‘బై నౌ.. పే లేటర్’ సేవలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. 2022లో 7 శాతంగా ఉన్న ఈ సంఖ్య.. 2025 నాటికి 12 శాతానికి చేరడం అమెరికన్ల ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.

సామాన్యుల కష్టాలు..

Advertisement

అమెరికా అంటే సంపదకు చిరునామా.. కానీ ఇప్పుడు అక్కడి సామాన్యుల పరిస్థితి మాత్రం లోన్లు.. EMIలు.. డిఫాల్ట్స్‌తో సతమతమవుతోంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో సామాన్యుల కష్టాలు పెరుగుతున్నాయన్న సంకేతాలకు ఈ రిపోర్టులు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Also read: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐదుగురు ఎమ్మెల్యేల తీరు.. వీరితో కష్టమేనా..?

Tags

Related News

మెట్రో రైలులో ప్రధాని మోదీ, సీఎం విజయ్ ప్రయాణం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

సీజేపీ నేతలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. అవేంటంటే?

సీజేపీ నిరసన మధ్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మెట్రో-ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశం

ఆదివారం సీజేపీ నిరసనలు.. జంతర్ మంతర్ వద్దకు రావాలని పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, తగలబడిన ఇళ్లు- దుకాణాలు, తొమ్మిది మంది మృతి

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

Big Stories

Advertisement
×