A girl cries Over Shreyas Iyer Wicket: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడవ టి20 ఇండోర్ వేదికగా జరుగుతోంది. అయితే ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ అటు ఇషాన్ కిషన్ ఇద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది టీమిండియా. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకే ఒక్క పరుగు చేసి వికెట్ సమర్పించుకున్నాడు.
దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతేకాదు ఇండోర్ స్టేడియానికి వచ్చిన ఓ లేడీ క్రికెట్ అభిమాని… కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ వికెట్ పడిపోగానే.. ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సీన్ చూసిన ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. గత కొన్ని మ్యాచులలో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్… సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో విఫలం కావడం అందరికీ బాధ కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడవ టి20 సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రోస్టన్ చేజ్ వేసిన ఓ అద్భుతమైన బంతికి ఒకే ఒక్క పరుగు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ LBW అయ్యాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బంతి పిచ్ అవుట్ సైడ్ పడ్డప్పటికీ కూడా…అంపైర్ అవుట్ ఇచ్చాడని మండిపడుతున్నారు. నిద్రపోయిన అంపైర్ … ఆ మాత్రం చూసుకోలేదా ? అంటూ నిలదీస్తున్నారు. ఇది ఇలా ఉండగా రెండో టి20 లో అద్భుతంగా రాణించిన సంజు… ఇవాల్టి మ్యాచ్ లో చేతులెత్తేశాడు. దీంతో అతడి బ్యాటింగ్ పై మళ్లీ విమర్శలు వస్తున్నాయి.
నిలకడ లేని ఆటగాడు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటోడు వరల్డ్ కప్ లో ఎలా రాణించాడని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఇతనికి ఛాన్సులు ఇవ్వడం మానేసి.. ఇక సంజు కు అవకాశాలు ఇవ్వకుండా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లు ఆడింది టీమ్ ఇండియా. ఈ నేపథ్యంలో 223 పరుగులు చేసిన టీమిండియా ఆల్ ఔట్ అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 69 పరుగులు సాధించగా ఈశాన్ కిషన్ 37 పరుగులతో దుమ్ము లేపాడు. తిలక్ వర్మ 28 పరుగులు చేయగా నితీష్ కుమార్ రెడ్డి 21, అక్షర్ పటేల్ 20 పరుగులు సాధించాడు. దీంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది టీమిండియా.
🔴A FEMALE FAN STARTS CRYING AFTER SHREYAS IYER’S WICKET 🤯🥹
– A fan came to watch Shreyas Iyer play, but he got out early. She became emotional and started crying. 💔😭 pic.twitter.com/4HJaVUbmv2
— Sam (@cricsam02) October 11, 2026