BigTV English

Fisherman rescues lovers attempting suicide: లవర్స్‌ని కాపాడిన మత్య్సకారుడు, లాగి చెంపదెబ్బ కొట్టాడు..

Fisherman rescues lovers attempting suicide: లవర్స్‌ని కాపాడిన మత్య్సకారుడు, లాగి చెంపదెబ్బ కొట్టాడు..

Fisherman rescues lovers attempting suicide: సమస్య వచ్చినప్పుడు పారిపోవడం, చనిపోవడం పిరికివాడి లక్షణం. దాన్ని దైర్యంగా ఎదుర్కోవడం తెలివైనవాడు చేసే పని. ప్రతీ సమస్యకు చావు పరిష్కారమైతే ఇప్పటికి చాలామంది చనిపోయేవారు. తాజాగా అలాగే ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. వారిద్దరు లవర్స్ ఎప్పటినుంచో ప్రేమించుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించారు. కాకపోతే ఇరు కుటుంబాల వారు అందుకు ససేమిరా అన్నారు. ఒకరి విడిచి మరొకరు ఉండలేమని భావించారు. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.


ఇద్దరు కలిసి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూసేశారు. సీన్ కట్ చేస్తే ఈ జంటను కాపాడిన వ్యక్తి లాగి యువకుడి చెంప ఛెళ్లుమనిపించాడు. ఇంకా లోతుల్లోకి వెళ్లే.. యూపీలోని ఓ జంట ప్రేమించుకుంది. ఇద్దరు చాలాకాలంలో ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వీరిని జంటగా చూసిన వ్యక్తి అమ్మాయి కుటుంబసభ్యులకు చెప్పాడు. కూతుర్ని పేరెంట్స్ మందలించారు.

అసలే యంగ్ వయస్సు, ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. దీంతో చనిపోయావాలని స్కెచ్ వేసుకున్నారు. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్ సమీపంలోని గోమతి నదిలోకి దూకి చనిపోవాలని నిర్ణయించు కున్నారు. పట్టపగలు రోడ్డుపై నుంచి నదిలోకి దూకేశారు. సీన్ కట్ చేస్తే అదే సమయంలో ఓ మత్య్స కారుడు ఈ జంటను కాపాడాడు. యువతిని బ్రిడ్జి కింద ఫిల్లర్ వద్ద కూర్చోబెట్టి ఆమెని స్పృహలోకి తీసుకొచ్చారు మరికొందరు. ఆమె ప్రియుడ్ని కాపాడిన మత్య్సకారుడు ఒడ్డుకు లాక్కొచ్చి అతడి చెంప ఛెళ్లుమనిపించాడు.


ALSO READ:  ‘నీట్‌’ పేపర్‌ లీక్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు

ఇంత పిరికివాడికి ప్రేమ నీకెందుకని ప్రశ్నించాడు ఫిషర్‌మెన్. చనిపోతే సమస్యకు పరిష్కారం దొరుకు తుందా అని చెప్పి వాళ్లను కన్వీన్స్ చేశాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మీ ప్రేమకు అర్థం ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వాళ్లని పంపించాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

Tags

Related News

Delhi Terrorists Arrested: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Big Stories

×