E-Paper
Advertisement

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, తగలబడిన ఇళ్లు- దుకాణాలు, తొమ్మిది మంది మృతి

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, తగలబడిన ఇళ్లు- దుకాణాలు, తొమ్మిది మంది మృతి
Advertisement

Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. జాతుల మధ్య ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడికిపోతోంది. తాజాగా నాగా-కుకీ వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో తొమ్మిది మంది మరణించారు. ఇళ్లు, షాపులు పదుల సంఖ్యలో తగలబడ్డాయి. ఉద్రిక్తతలను మళ్లీ పెరగడంతో కాంగ్‌పోక్పి జిల్లాలో బంద్‌కు దారి తీసింది.

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్‌‌లో మళ్లీ హింస చెలరేగింది. కామ్జోంగ్‌-ఉఖ్రుల్‌ జిల్లాల్లో జరిగిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో కుకీలు-నాగాల వర్గాలకు చెందినవారు ఉన్నారు. కామ్‌జోంగ్ జిల్లాలోని చస్సాద్ గ్రామంలో సాయుధ బృందాలు-భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 42 ఏళ్ల కుకీ మహిళ డోమ్‌ఖోనీ టౌతాంగ్ మరణించింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి హింస తీవ్రమైంది. పోలీసుల కథనం ప్రకారం.. చస్సాద్‌లో అక్రమ బంకర్లను తొలగించేందుకు మణిపూర్ పోలీసులు-ఇండియా రిజర్వ్ బెటాలియన్-బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందితో కూడిన సంయుక్త బృందం ఆపరేషన్ ప్రారంభించింది.

ఈసారి నాగ-కుకీల మధ్య జాతి ఘర్షణలు

Advertisement

స్థానిక మహిళలు ఆ ఆపరేషన్‌కు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించారు. దీంతో గుర్తు తెలియని దుండగులు.. భద్రతా బృందంపై కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ప్రతిచర్యకు దిగాయి. గుర్తు తెలియని దుండగులు పలు ఇళ్లు, షాపులకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా సాయుధ బృందాలు-భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నాగ-కుకీ వర్గాలకు చెందిన సుమారు 14 ఇళ్లు తగలబడ్డాయి. సాయంత్రం వరకు మృతుల సంఖ్యపై మణిపూర్ పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. ఆ తర్వాత ఈ గొడవలు అక్కడక్కడా నాగా-కుకీల ఆధిపత్య జిల్లా కాంగ్‌పోక్పికి వ్యాపించింది.

9 మంది మృతి.. పదుల సంఖ్యలో ఇళ్లు-షాపులు దగ్దం

కాంగ్‌పోక్పిలోని తపోన్-మకుయి అషాంగ్ గ్రామాలలో భద్రతా దళాలకు-సాయుధ బృందాలకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ రెండు గ్రామాలు నాగాల ఆధిపత్యం ఉన్నవే. మూడేళ్ల కిందట అంటే 2023 మే 3న మణిపూర్‌లో ప్రధాన వర్గాలు మైతేయిలు-కుకీల మధ్య హింస తొలిసారిగా చెలరేగింది. అప్పటి నుంచి మణిపూర్ జాతి ఘర్షణలతో అట్టుడికిపోతోంది. గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో హింస కొద్దికాలం పాటు తగ్గింది. మళ్లీ ఫిబ్రవరిలో సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్ నియమితులైన తర్వాత ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

Advertisement

ALSO READ: భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఈసారి జాతి ఘర్షణలు మైతేయిలు-కుకీలు-నాగాల వైపుకు మారాయి. ఆనాటి నుంచి జరిగిన హింసాకాండలో మూడు వర్గాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం ఖేమ్‌చంద్.. ప్రధాని మోదీకి వివరించారు. ఇంఫాల్-దిమాపూర్- గౌహతి బస్సు సర్వీసులను పునఃప్రారంభించడం, ఇంఫాల్-సిల్చార్, ఇంఫాల్-దిమాపూర్ రహదారులపై రవాణా రాకపోకలను పునరుద్ధరించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హోదా ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించిన ప్రధాని మోదీ, శాంతి పునరుద్ధరణకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Related News

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

Big Stories

Advertisement
×