E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: పాపం చందు.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం పై వల్లి సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: పాపం చందు.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం పై వల్లి సీరియస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 11th: నా కూతుర్నే ఇంట్లో నుంచి గెంటేస్తారా అసలు ఏమనుకుంటున్నారు.. మీరు అంటూ భాగ్యం ఒక్కసారిగా అడ్డుపడుతూ రెచ్చిపోతుంది.. నా కూతురు జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని భాగ్యం ఎంతగా అంటున్న సరే వేదవతి దిమ్మతిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. అయితే వేదవతి ఏంటే ఇంకా రెచ్చిపోతున్నావు నువ్వు చేసిన మోసాలు దారుణాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోతున్నావేంటి అంటూ భాగ్యంపై సీరియస్ అవుతుంది. నా పిల్లలు మాత్రమే తప్పు చేశారా మీ పిల్లలు ఏ తప్పులు చేయలేదా మీ పిల్లలు చేసిన తప్పులుకి మీరు జవాబు చెప్పండి అంటూ భాగ్యం అనగానే నా ఇంటికి వచ్చి నా పిల్లల గురించి మాట్లాడుతున్నావా ఎవరితో నువ్వు అసలు వేదవతి మాటకు మాట సమాధానం చెబుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

వల్లిని గెంటేసిన వేదవతి..

శ్రీవల్లి నన్ను వదిలిపెట్టండి నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను అని అందరినీ పేరుపేరునా బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే అందరూ కూడా నీ నాటకాలు ఇంకా కట్టిపెట్టు అని అంటారు. ఇక కామాక్షి ఏంటమ్మా వీళ్ళతో మాటలు ఇంత మోసం చేసిన తర్వాత కూడా వీళ్ళని ఇంకా ఇంట్లో ఉంచాలా పదమ్మ వీళ్లిద్దరిని బయటికి గెంటేద్దామని అంటుంది. అటు వేదవతి కామాక్షి ఇద్దరు కూడా భాగ్యం శ్రీవల్లిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు.. ఎందుకే వీళ్ళ కోసం ఏడుస్తున్నావు. వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ భాగ్యం రెచ్చిపోతుంది. ఈ క్షణం నుంచి నీ కూతురికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చందు కూడా అనడంతో వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ భాగ్యం మాత్రం మీ అంత చూస్తాను అంటూ అక్కడినుంచి వెళ్తుంది..

పాపం చందు..

Advertisement

ఇక అందరూ రాత్రి అవగానే వల్లి వెళ్లిపోయిందని చాలా బాధపడిపోతూ ఉంటారు వల్లి ఇలాంటి మోసాలు చేసి వెళ్లిపోయింది అని అందరూ కూడా ఫీలవుతూ ఉంటారు. వల్లి వదిన ఇలా చేస్తుంది అని నేను అసలు ఊహించలేదు అని అటు సాగర్ ఇటు ధీరజ్ కూడా అంటారు. మా భార్యలు కూడా మా దగ్గర అన్ని దాస్తూ ఉంటారు మాకు చివరి వరకు ఏది చెప్పరు అని అనడంతో చందు సీరియస్ అవుతాడు. నర్మదా ఇంటి పరువు పోకూడదు అని ఇన్ని రోజులు ఆగింది నర్మద ఎప్పటికీ కరెక్ట్ గానే ఉంటుంది నువ్వు నర్మద గురించి ఒక మాట అన్నా నేను ఊరుకోను అని చందు అంటాడు. అటు ప్రేమను కూడా ధీరజ్ తిట్టడంతో ప్రేమ నిజం చెప్తుంది. ఇక వల్లి గురించి మర్చిపోండి తన గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు అని చందు అందరికీ సీరియస్ గా చెప్తాడు.

సుకన్యకు దిమ్మతిరిగే షాక్..

అందరూ సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సుకన్య కాఫీ తీసుకొని వస్తుంది. చందు కాఫీ తీసుకుంటాడు.. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కాఫీ తీసుకోకపోవడంతో సుకన్య చాలా ఫీల్ అవుతుంది. వల్లి వాళ్ళ బ్యాచ్ తో కలిసి ఈ సుకన్య కూడా కుట్రలు చేసింది ముందు దీన్ని కూడా బాగుంటుంది అని ప్రేమ అంటుంది. కానీ మా తిరుపతి బాబాయ్ ని పెళ్లి చేసుకుందాం అన్న ఒకే ఒక్క మాటతో నేను ఇక్కడే ఉంచాల్సి వచ్చింది. లేదంటే మాత్రం నిన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తే ఒక పని అయిపోతుంది అని ప్రేమ సీరియస్ అవుతుంది. సుకన్య అలాంటిది కాదులే అమ్మ అలా చేయదు అని తిరుపతి చెప్పడంతో సుకన్యను వదిలేస్తారు దాంతో సుకన్య సేఫ్ అని చాలా హ్యాపీగా ఉంటుంది.

భాగ్యంకు స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

శ్రీవల్లి తన ఫోన్ తో చందు కి అలాగే ఇంట్లోనే వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్కరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా బాధ పడిపోతూ ఉంటుంది. తన కాపురం ఇలా అయింది అని బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. అయితే అప్పుడే భాగ్యం ఆనందరావు అమ్మడు ఏడ్చి ఏడ్చి గొంతు బొంగురు పోయి ఉంటుంది. ఒక ముద్ద అన్నం తిని ప్రశాంతంగా నిద్రపో అవే సర్దుకుంటాయి అని ఆనందరావు భాగ్యం అంటారు. నా కాపురం ఇలా అవ్వడానికి కారణం మీరే ఇప్పుడు నాకు అన్నం తినమని చెప్తున్నారా ఎలా తినమంటావు అన్నం గొంతులో దిగుతుందా అసలు అని ఆ అన్నం ప్లేటును విసిరి కొట్టేస్తుంది. నీకేమైనా పిచ్చి గాని పట్టిందా అన్నం ప్లేట్లు ఎవరైనా విసిరి కొడతారా అని భాగ్యం అంటుంది. నీవల్లే నాకు కాపురం ఇలాంటి మారింది నువ్వు నాతో మాట్లాడద్దు అనే శ్రీవల్లి చాలా ఫీల్ అవుతుంది.

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

రామరాజు నా పెద్ద కోడల్ని ఏరి కోరి నేనే తెచ్చుకున్నాను ఎటువంటి ఎంక్వయిరీ చేయకుండా మంచిది అని కొద్దిగా నమ్మి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను అని బాధ పడిపోతూ ఉంటాడు. అయితే అప్పుడు అక్కడికి వేదవతి భోజనం తీసుకుని వస్తుంది ఎలా తినమంటావు బుజ్జమ్మ నా కొడుకు జీవితం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. నేనే వాడి జీవితాన్ని నాశనం చేశాను అని అనుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది అంటూ బాధ పడిపోతాడు రామరాజు. నువ్వేమీ బాధపడొద్దు అండి మీరు ఏమి తప్పు చేయలేదు కదా..ఆమె గురించి తెలుసుకోకుండా చేశాము ఇప్పుడు బయటపడింది కదా.. చందు చాలా సంతోషంగానే ఉన్నాడు అని వేదవతి అంటుంది కానీ రామరాజు మాత్రం నా కొడుకు జీవితం నాశనం అవ్వడానికి లేనే కారణమని చాలా బాధపడిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ఈ వారం టాప్ సీరియల్స్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు రచ్చ రచ్చ.. రోహిణి ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు షాక్…

Nindu Noorella Saavasam Serial Today Episode October 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి కనిపెడుతుందా..?

Telugu Serials : ఈ వారం టాప్ సీరియల్స్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఎండ్ కార్డు..

Podarillu chakri : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పునకాలే.. ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలే..

జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!

Big Stories

Advertisement
×