E-Paper
Advertisement

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!
Advertisement

IRCTC Chart Vacancy: రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య కన్ఫర్మ్ టికెట్ దొరకకపోవడం. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో రిజర్వేషన్ టికెట్లు దొరకడం కష్టం అవుతుంది. అయితే, రిజర్వేషన్ చార్ట్ రెడీ అయిన తర్వాత కూడా కొన్ని సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సీట్ల వివరాలను తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు క్రేజీ సదుపాయాన్ని అందిస్తోంది. అదే చార్ట్ వేకెన్సీ ఫీచర్. దీని ద్వారా రైలులో ఏ కోచ్‌లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. వాటిని బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్లొచ్చు.

రైలులో ఖాళీ సీట్ల వివరాలు ఎలా తెలుసుకోవాలి?

ప్రయాణికులు IRCTC వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి చార్ట్ వేకెన్సీ ఆప్షన్‌ ను ఉపయోగించవచ్చు. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఈ ఫీచర్ ద్వారా చెక్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల టికెట్ కోసం TTE దగ్గరకు వెళ్లే ముందు కూడా కొంత సమాచారం తెలుసుకోవచ్చు. ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో చార్ట్ వేకెన్సీ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ప్రయాణానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి. రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కే స్టేషన్ లాంటి వివరాలను ఇవ్వాలి. ఆ తర్వాత సంబంధిత రైలు రిజర్వేషన్ చార్ట్‌ లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను పరిశీలించాలి.

ఏ కోచ్‌లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు!

Advertisement

చార్ట్ వేకెన్సీ ఫీచర్‌ లో రైలు కోచ్‌ల వారీగా ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు తమకు అవసరమైన క్లాస్‌ను ఎంచుకుని అందుబాటులో ఉన్న బెర్త్‌ లను చెక్ చేసుకోవచ్చు. అయితే, ఈ వివరాలు రిజర్వేషన్ చార్ట్‌ లోని పరిస్థితిని బట్టి మారవచ్చు. ఇతర ప్రయాణికులకు సీట్లు కేటాయించడం, రైల్వే సిబ్బంది చేసే మార్పుల కారణంగా ఖాళీ సీట్ల సమాచారం ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుంది. అందువల్ల వెబ్‌సైట్‌లో కనిపించిన సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ప్రయాణానికి రెడీ కాకూడదు.

ఖాళీ సీటు కనిపిస్తే వెంటనే బుక్ చేసుకోవచ్చా?

ఖాళీ సీటు కనిపించినంత మాత్రాన ప్రయాణికులు నేరుగా ఆ సీటులో కూర్చోవడానికి అనుమతి ఉన్నట్లు కాదు. రైల్వే నిబంధనల ప్రకారం ఆ సీటు కేటాయింపునకు అందుబాటులో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. సీటు అందుబాటులో ఉంటే, అప్పుడు బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు రైలులో ఉన్న TTEని సంప్రదించి ఖాళీ సీటు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు.  టికెట్ కన్ఫర్మ్ కాక ఇబ్బంది పడుతున్న వారికి చార్ట్ వేకెన్సీ చాలా ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Read Also: రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

Tags

Related News

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×