BigTV English

India vs Pakistan : హైదరాబాద్, వైజాగ్‌లో రేపు జరగబోయేది ఇదే.. భయపడొద్దు!

India vs Pakistan : హైదరాబాద్, వైజాగ్‌లో రేపు జరగబోయేది ఇదే.. భయపడొద్దు!

India vs Pakistan : మీరు హైదరాబాద్‌లో ఉంటారా? ఈ న్యూస్ మీకోసమే. మీరు వైజాగ్ వాసులా? మీరు అలర్ట్ అవ్వాల్సిందే. మే 6. ఈ డేట్‌ను క్యాలెండర్‌పై మార్క్ చేసుకుని పెట్టుకోండి. బుధవారం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రెండు నగరాలపై పాకిస్తాన్ దాడి చేయబోతోంది. బాంబులతో విరుచుకుపడబోతోంది. డౌట్ వద్దు. నిజమే. ఇండియా, పాకిస్తాన్ వార్‌లో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నంలపై పాక్ అటాక్ చేయనుంది. మరి, అదే జరిగితే మనమేం చేయాలి? ఆర్మీ ఏం చేస్తుంది? పోలీసులు, అధికారుల రోల్ ఏంటి? యువత, విద్యార్థులు ఎలా స్పందిస్తారు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కంప్లీట్ డీటైల్స్‌లోకి వెళ్లే ముందు.. ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.


మోదీ, దోవల్ మీటింగ్.. ఏంటి సంగతి?

ప్రధాని మోడీతో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు.. దేశ భద్రత, యుద్ధ సన్నద్ధతపై చర్చించారు. పాక్, ఇండియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వీరిద్దరి వన్ టు వన్ మీటింగ్‌‌పై హైఅటెన్షన్ నెలకొంది. వార్ మ్యాప్ దాదాపు రెడీ అయిపోయిందా? నేడో, రేపో జంగ్ సైరన్ మోగనుందా? యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలో, యుద్ధం తర్వాత జరిగే పరిణామాలపై అజిత్ దోవల్ పర్సనల్‌గా ప్రధాని మోదీకి ఓ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు.


259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్

మరోవైపు, కేంద్రహోంశాఖ హైలెవల్ మీట్‌ నిర్వహించింది. రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టింది. బుధవారం దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ చేయనున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్‌, పోర్ట్స్‌, ఎనర్జీ హబ్స్‌ వారీగా విభజించారు. కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండటంతో అదే పాకిస్తాన్‌కు మెయిన్ టార్గెట్. ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో సహా.. అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు కేటగిరి 1 లో ఉన్నాయి.

హైదరాబాద్, వైజాగ్‌లపై పాక్ టార్గెట్

ఇక, తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, వైజాగ్‌లు కేటగిరి 2 లో ఉన్నాయి. అంటే, యుద్ధమే మొదలైతే.. పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో.. మన రెండు నగరాలు కూడా ఉంటాయని అంచనా వేస్తోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో బుధవారం హైదరాబాద్, విశాఖపట్నంలో వార్ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. మాక్ డ్రిల్ ఎలా చేపట్టాలనే దానిపై రాష్ట్ర అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి తగు సూచనలు చేసింది కేంద్రం. సిటీ మొత్తం కాకుండా.. నగరంలో ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేయాలి.. ఏయే ప్లేసెస్‌పై అటాక్ జరిగే అవకాశం ఉంది.. అనే జాబితాను కూడా కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అందజేసినట్టు సమాచారం. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా బుధవారం మాక్ డ్రిల్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మాక్ డ్రిల్‌ ఎలా చేస్తారంటే..

రియల్ వార్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రాక్టీస్ చేసేందుకే ఈ మాక్ డ్రిల్. ముందుగా కరెంట్ ఆఫ్ చేస్తారు. మొబైల్ సిగ్నల్స్ బ్లాక్ చేస్తారు. ట్రాఫిక్ దారి మళ్లిస్తారు. ప్రజలను అలర్ట్ చేస్తారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. బుధవారం యుద్దం తరహా ఎమర్జెన్సీ క్రియేట్ చేసి.. పోలీసులు, పారా మిలటరీ విభాగాలు ఎలా వ్యవహరించాలో మాక్ డ్రిల్‌తో చెక్ చేయనున్నారు.

విశాఖ హాట్ స్పాట్

విశాఖలో నావీ బేస్ ఉంది కాబట్టి.. పాక్‌తో యుద్దం వస్తే.. వైజాగ్‌ను కచ్చితంగా టార్గెట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ముంబై, చెన్నై, విశాఖ లాంటి సముద్ర తీర నగరాలపై యుద్ధ నౌకలతో అటాక్ చేసే ప్రయత్నం జరగొచ్చు. అటు, హైదరాబాద్‌లో DRDO, సికింద్రాబాద్ ఆర్మీ రెజిమెంట్, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ తదితర వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, భాగ్యనగరంపైనా పాక్ కన్నేయవచ్చు. అందుకే, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 259 ప్రాంతాల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌లను కూడా చేర్చింది కేంద్రం. బుధవారం మాక్ డ్రిల్.. మినీ యుద్ధం మాదిరి ఉండొచ్చని అంటున్నారు. వార్ టైమ్‌లో మన వివిధ విభాగాల సన్నద్ధత ఎలా ఉందో ఈ మాక్ డ్రిల్‌తో తేలిపోనుంది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలో కూడా అవగాహన కల్పించనున్నారు.

వాటర్ మైన్ టెస్ట్ సక్సెస్

మరోవైపు, భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పోటాపోటీగా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. ఇండియా మరో స్వదేశీ గ్రౌండ్ వాటర్ మైన్‌ను విజయవంతంగా టెస్ట్ చేసింది. దీనిని విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్స్‌లో అభివృద్ధి చేశారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ సంయుక్తంగా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్‌ను రూపొందించింది. అండర్ వాటర్‌లో తక్కువ శబ్ధంతో పేలడం, మూడు సెన్సర్లు కలిగి ఉండటం ఈ మైన్ ప్రత్యేకత. ఇవి వార్‌ షిప్స్, సబ్‌మెరైన్స్‌ల కదలికలను ఈజీగా గుర్తించేందుకు సాయపడతాయి. అంతేకాకుండా అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థతతో తయారుచేసిన ఈ మైన్‌.. సేకరించిన డేటాను ప్రాసెస్ చేసి, సులభంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో.. భారత నేవీలో అండర్ వాటర్ యుద్ధ సామర్థ్యం మరింత బలపడింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×