BigTV English

Operation Sindoor: 100 మంది టెర్రరిస్టులను చంపేశాం.. పక్కా ప్లాన్‌తో అటాక్ చేశాం

Operation Sindoor: 100 మంది టెర్రరిస్టులను చంపేశాం.. పక్కా ప్లాన్‌తో అటాక్ చేశాం

Operation Sindoor: ఉగ్రవాది అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని డీజీఎంవో లెఫ్టినెంట్ జనర్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు భారత్, దాయాది దేశం పాకిస్థాన్‌ల మధ్య జరిగిన పరిణామాల గురించి వివరించేందుకు త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు.


అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశామని అన్నారు. మొత్తంగా 100 మంది టెర్రరిస్టులు హతం అయ్యారని.. మిగితావారు పారిపోయారని వెల్లడించారు. ఉగ్రవాదులు, వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశామని తెలిపారు. పాకిస్థాన్ చేసిన డ్రోన్, మిసైల్స్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పారు. పాకిస్థాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థినా మందిరాలు, స్కూళ్లను టార్గెట్ చేసిందని అన్నారు. భారత్ నగరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని వివరించారు.  శ్రీనగర్ నుంచి నలియా దాకా పాకిస్థాన్ డ్రోన్లు వచ్చాయని డీజీఎంఓ తెలిపారు.

Also Read: PM Modi: మళ్లీ గెలికితే ఇక విధ్వంసమే.. ప్రధాని మోదీకి అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫోన్


డ్రోన్లకు ఎదురుదాడిగా పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు చేశాం. పాక్ వైపు 35 నుంచి 40 మంది సైనికులు హతం అయ్యారు. టార్గెట్ లను పక్కాగా ప్లాన్ చేసి పాకిస్థాన్ పై దాడులు చేశామని అధికారులు వివరించారు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశామన్నారు. ఉగ్రవాద ట్రైనింగ్‌ సెంటర్లను ముందే గుర్తించామని చెప్పారు. దాడికి ముందే ఉగ్రవాదులు ట్రైనింగ్‌ సెంటర్లను ఖాళీ చేశారని అధికారులు పేర్కొన్నారు. మురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్‌ క్యాంపులను తొలిసారి నాశనం చేశామని వివరించారు.

‘అజ్మల్‌ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీ లాంటి డేంజర్ ఉగ్రవాదులు ఇక్కడే ట్రైనింగ్‌ తీసుకున్నారు. మేం ఎయిర్‌ స్ట్రైక్‌ చేసిన తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్  వద్ద పాక్‌ కాల్పులకు పాల్పడింది. పాకిస్థాన్ ఆర్మీ లాహోర్‌ నుంచి డ్రోన్‌, మిసైల్స్ తో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది. కానీ ఆ దాడులను భారత్ త్రివిద దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాం. లాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాం. ఈనెల 8, 9 తేదీల్లో పాకిస్థాన్, శ్రీనగర్‌ నుంచి నలియా వరకు డ్రోన్‌లతో దాడులు చేసింది. పాక్ డ్రోన్ దాడులు భారత్ ఈజీగా ఎదుర్కొని ఎదురుదాడులు చేసింది’ అని అధికారులు పేర్కొన్నారు.

మరోసారి ​కాల్పులు జరిపితే పాక్‌ను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ‘శనివారం మధ్యాహ్నం 3:15గంటలకు పాకిస్థాన్ డీజీఎంవో మాకు ఫోన్‌ చేశారు. కాల్పుల విమరణకు అంగీకరించాలని పాకిస్థాన్ ప్రాధేయపడింది. దీంతో భారత్ ప్రభుత్వం విరమణకు అంగీకరించింది. అయితే, కాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్‌ కాల్పులు శ్రీగర్ లో కాల్పులు జరిపింది. కాల్పులు జరిపింనందుకు పాకిస్థాన్ కు వార్నింగ్‌ మెసేజ్‌ పంపినట్టు అధికారులు వెల్లడించారు.

ఒకవేళ పాకిస్థాన్ మళ్లీ కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్‌ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే.. పాక్‌ అంతు చూస్తాం. ఆపరేషన్‌ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు. పాక్‌ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు నివాళులు ఆర్పిస్తున్నాం. భారత సైనికుల త్యాగం ఎన్నటికీ వృథా కాదు. ఇకనుంచి రాత్రి ఏం జరుగుతుందో మానిటర్‌ చేస్తాం’ అని త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×