Big Stories

Arvind Kejriwal: జైలు నుంచి పోటీ చేసినా.. ఢిల్లీలో 70 సీట్లు గెలుస్తాం: కేజ్రీవాల్‌

Arvind kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్భంధించి ఎన్నికలు జరపాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

- Advertisement -

ప్రజలు అమాయకులని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఢిల్లీ ప్రజలే దీటుగా బదులిస్తారని పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జైలు పాలైనా సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించగా తాను ఒక వేళ రాజీనామా చేస్తే తర్వాత మోదీ బెంగాళ్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరాయి విజయన్ ఇలా విపక్ష సీఎంలను టార్గెట్ చేస్తారని సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Also Read: వెనక్కి తగ్గేది లేదన్న స్వాతి, ఆపై ఎంపీ సీటుకు..

అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నా తన భార్య ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. విపక్ష నేతలను అరెస్టు చేసి ఆయా ప్రభుత్వాలను కూల్చాలని మోదీ సర్కార్ భావిస్తుందని అన్నారు. తనకు పదవీ కాంక్ష లేదని.. తాను రాజీనామా చేస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని తెలిపారు. గతంలో మురికి వాడలో పనిచేసేందుకు ఆదయపన్ను శాఖ కమిషనర్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News