E-Paper
Advertisement

సీజేపీ నిరసనకారులకు ఆహారం ఎవరిస్తున్నారు? అజ్ఞాత దాతలు వెనుక అసలు కథ

సీజేపీ నిరసనకారులకు ఆహారం ఎవరిస్తున్నారు? అజ్ఞాత దాతలు వెనుక అసలు కథ
Advertisement

CJP Protesters: ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో బొద్దింక జనతా పార్టీ నిరసన వెనుక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? నిరసనకారులు రాత్రి వేళ ఆహారం ఎవరు ఇస్తున్నారా? ఫుడ్ యాప్‌ల నుంచి వాళ్లకు ఆహారం, నీరు, సామగ్రి ఎవరిస్తున్నారు? ముంబై వంటి నగరాల నుంచి వస్తున్నాయా? వీరికి విదేశీ సాయం ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

నిరసనకారులకు ఆహారం- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ ఆందోళనకు దిగింది. పేపర్ లీక్ కారణమైన మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. సోమవారం నుంచి ఆందోళనకు దిగింది. అయితే రోజు రోజుకూ నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పగలు-రాత్రి వేళ కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేకాదు జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఫుడ్ డెలివరీ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

అజ్ఞాత దాతలు ఎవరు? నిరసనల్లో చాలామంది పాల్గొనకపోయినా అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమానికి తమ మద్దతుగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆహారాన్ని ఆర్డర్ చేసి ఆకలితో ఉన్న ఎవరికైనా పంచమని కోరినట్టు సమాచారం. చెల్లింపు ఇప్పటికే ఆన్‌లైన్‌లో జరిగిందని డెలివరీ భాగస్వామి వీడియో బయటకు వచ్చింది.

ఆహారం రావడంపై సీజేపీ రియాక్ట్- అప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లెక్కలేని ఫుడ్ ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా నిరసన ప్రదేశంలో ఆహారం మిగిలిపోయింది. ఇవాళ మా వద్ద తగినంత ఆహారం ఉందని, ఏదీ వృధా కాలేదని కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ప్రస్తావించింది. పేరు గానీ, ఇతర వివరాలు గానీ లేకుండా వెల్లడించలేదు.

Advertisement

కేవలం జంతర్ మంతర్ అనే చిరునామాతో ఇదంతా జరుగుతోంది. ఆహారాన్ని బఫే తరహాలో ఏర్పాటు చేశామని, ఎవరైనా తమకు నచ్చిన దానిని తీసుకోవచ్చని రాసుకొచ్చింది. ఢిల్లీ ప్రజల నుండి ఎంతటి హృదయపూర్వకమైన స్పందన అంటూ రాసుకొచ్చింది.

ALSO READ: సీజేపీ ఆందోళనలు తీవ్రతరం..  రూ.10 కోట్ల ఆఫర్, బీజేపీ ఎంపీ సంచలన వీడియో

నిరసన కారులు మాత్రం తమకు ఢిల్లీ, మహారాష్ట్ర, నాగ్‌పూర్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి కూడా ఫుడ్‌ ఆర్డర్లు వచ్చినట్లు చెబుతున్నారు. ముంబై, హైదరాబాద్‌ నగరాల నుంచి సహాయం అందుతోందని, వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొన లేకపోయినా ఆహారం రూపంలో మద్దతు తెలిపారని చెబుతున్నారు. నిధులపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని అంటున్నారు.

నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్నదానిపై అధికార-ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి జంతర్‌మంతర్‌ ఆహారంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

 

Related News

సీజేపీ ఆందోళనలు తీవ్రతరం.. రూ.10 కోట్ల ఆఫర్, బీజేపీ ఎంపీ సంచలన వీడియో

యువత ఆందోళన తీవ్రమైన వేళ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన, పేపర్ లీక్ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..

బెంగుళూరు ట్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్.. జంతర్‌మంతర్ వేదికగా రగిలిన నిరసన జ్వాలలు

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×