OTT Movie : ఎన్నిసమస్యలు ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా మనిషికి రిలీఫ్ ఇచ్చేది నవ్వు మాత్రమే. ఏ డాక్టర్ ఇవ్వలేని మందు ఏదైనా ఉంది అంటే అది నవ్వు మాత్రమే. అయితే కడుపుబ్బా నవ్వుకోవడానికి, మైండ్ రిలాక్స్ అవ్వడానికి కొన్ని కామెడీ సినిమాలు వస్తుంటాయి. వీటిని చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ, మనల్ని మనమే మరచిపోతాము. అలాంటి కామెడీ సినిమా రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ స్టోరీ తిరుప్పూర్ అనే పట్టణంలో ఒక ఉద్యోగి మద్యం మత్తులో రాత్రి చేసే అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఇందులో ప్రిత్వీరాజ్ రామలింగం నటన అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ తమిళ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
శాంతకుమార్ తిరుప్పూర్‌లోని ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంటాడు. తన జీతంలో సగం తన భార్య,మరికొంత తన తల్లికి పంపుతూ ఒక చిన్న గదిలో జీవిస్తుంటాడు. హిస్టరీ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు లేక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న శాంతకుమార్, తన పుట్టినరోజున తన యజమాని కొడుకు చేతిలో అవమానానికి గురవుతాడు. జీతం ఆలస్యం కావడంతో, అతను తన ఇంటి యజమాని నీరుతో వాగ్వాదానికి దిగుతాడు. జీతం వచ్చిన తర్వాత, శాంతకుమార్ మద్యం కొని, తన అవమానాన్ని మరచిపోవడానికి మత్తులో మునిగిపోతాడు. తాగిన స్థితిలో అతను ఒక పోలీసు వాకీ-టాకీని దొంగిలించి, తన పాత ప్రియురాలు కృష్ణవేణి ఇంటికి వెళ్తాడు. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుని తన భర్తతో కలసి ఉంటుంది. ఇతను అక్కడికి రావడం, ఇబ్బందికరమైన సన్నివేశాలకు దారితీస్తుంది.
Read Also : సొంత భార్యనే పరాయి మగాళ్ల దగ్గరకు… నన్ అని కూడా చూడకుండా… మతిపోగోట్టే మలయాళ క్రైమ్ డ్రామా
ఏ ఓటీటీలో ఉందంటే
‘గుడ్ డే’ (Good Day) తమిళ భాషలో రూపొందిన ఒక కామెడీ డ్రామా సినిమా. దీనికి ఎన్. అరవిందన్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రిత్వీరాజ్ రామలింగం, మైనా నందిని, కాలి వెంకట్, ఆడుకలం మురుగదాస్, బాగవతి పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూన్ 27న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలై, Sun NXT లో ఆగష్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. 122 నిమిషాల నిడివితో IMDbలో ఈ సినిమా 8/10 రేటింగ్ పొందింది.