BigTV English

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Viral video: తాజాగా సోషల్ మీడియాలో ఇంటి తాళాన్ని ఖతార్నక్ ఐడియాతో ఓపెన్ చేసిన వీడియో మస్త్ వైరల్ అవుతోంది. ఇలా కూడా దొంగతనాలు జరుగుతాయా..? అన్న రేంజ్‌లో ఉంది ఆ వీడియో.. ఇది కనుక మీరు చూస్తే ఇంటి భద్రత గురించి తీవ్ర ఆందోళనలను కలిగించడం ఖాయం. భారీ పరిమాణంలో ఉన్న తాళాలను కూడా సింపుల్ గా తీసే టెక్నిక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇలాంటి సంఘటన గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


?utm_source=ig_web_copy_link

ఈ వీడియో ఆగస్టు 12 న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నట్టు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. భారీ పరిమాణంలోని తాళాలను నిశ్శబ్దంగా.. అతి సులభంగా పెట్రోల్, లైటర్ ఉపయోగించి తెరవడం చూపించాడు. దొంగలు ఎలా దోపిడికి పాల్పడుతున్నారో చూపించే ప్రయత్నం చేశాడు. ఓ వ్యక్తి సాధారణ వస్తువులతో తాళం తెరవడం చూపించాడు. ముందుగా అతను సిరంజిలో పెట్రోల్ పోశాడు. దాన్ని తాళం కీ హోల్‌లో.. అలాగే పైభాగంలో పిచికారీ చేశాడు. ఆ తర్వాత కొన్ని సెకన్లు వేయిట్ చేసి.. లైటర్‌తో మంట పెడతాడు. ఈ మంటలు తాళంలోని ప్లాస్టిక్ భాగాలను సులభంగా కరిగించి, తాళాన్ని సులభంగా తెరవడానికి వీలు కల్పిస్తాయి. ఈ వ్యక్తి పోలీసులతో చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చే తాళాలలో ప్లాస్టిక్ పొరలు ఉంటాయని, అవి మంటలకు సులభంగా కరిగిపోతాయని చెప్పాడు.


ALSO READ: Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ వైరల్ గా మారింది. విస్తృతంగా షేర్ అయ్యింది. ఈ టెక్నిక్ ను చూసి చాలా మంది ఆందోళనకు గురవుతుంటే.. మరికొంత మందికి షాక్ కు గురవుతున్నారు. ఓ వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘భారతదేశంలో టాలెంట్ లేదని ఎవరు అన్నారు..? చైనా దేశం 2025లో ఉంటే, మన దొంగలు 3030లో ఉన్నార్రా బాబు’ అని కామెంట్ చేసుకొచ్చాడు. మరొకరు ‘ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల.. తెలియని దొంగలు సులభంగా తెలుసుకుంటారు’ అని కామెంట్ చేసుకొచ్చాడు. అయితే, కొందరు ఈ వీడియో ఫేక్ అని, జస్ట్ వ్యూస్ ఇలా చేస్తున్నారని పేర్కొన్నాడు. ఈ టెక్నిక్‌ను తాను ప్రయత్నించానని ఇది ఫెయిల్డ్ టెక్నిక్ అని చెప్పుకొచ్చాడు. ఇది కేవలం కొన్ని రకాల తాళాలపై మాత్రమే పనిచేయొచ్చని అన్నాడు.

ALSO READ: Heavy rains: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

అయితే.. అసలు ఈ వీడియోలో నిజం ఉందా..? లేకుంటే ఫేక్ వీడియోనా..? పక్కన పెడితే.. నెటిజన్లు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఇలాంటి పనులకు పాల్పడితే ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మటాష్ కావడం ఖాయం అని ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఘటన ఇంటి రక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Big Stories

×