Wife Sleeping PIlls Husband| వివాహం చేసుకొని అత్తమామలు, భర్త, ఇద్దరు పిల్లలతో చక్కని కాపురం చేసుకుంటున్న ఓ మహిళ కోరికలకు బానిసై.. పెద్ద ఘాతుకానికి పాల్పడింది. అప్పటికే ఆమెకు ఒక ప్రియుడుండగా.. మరో ప్రియుడిని సెట్ చేసుకుంది. తనపై ముందునుంచి అనుమానం పడే భర్తకు ఈ విషయం తెలిసిపోతుందని భయపడి ఇంట్లో అందరికీ భోజనంలో స్లో పాయిజన్ కలిపి ఇచ్చింది. ఇలా చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. కానీ బ్యాడ్ లక్ ఆమె బండారం బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో నివసించే చైత్ర అనే ఓ 33 ఏళ్ల మహిళ.. తన కుటుంబ సభ్యులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి చంపేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. చైత్ర హాసన్ జిల్లా బేలూరు తాలూకాకు చెందిన గజేంద్రను 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
చైత్ర తన వివాహేతర సంబంధాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకుంది. ఈ కారణంగానే ఆమె తన భర్త, పిల్లలు, అత్తమామల కుటుంబ సభ్యుల భోజనంలో నిద్రమాత్రలు కలపడం ప్రారంభించింది. ఈ పనిలో ఆమె ప్రియుడు శివు సహాయం చేశాడు. అతనే ఆమె కోసం నిద్రమాత్రలు తీసుకొచ్చేవాడు. అయితే, ఒక రోజు చైత్ర పర్సులో నిద్రమాత్రలు చూసిన ఆమె భర్త గజేంద్ర.. ఈ హత్యాయత్నాన్ని గుర్తించి, బేలూరు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు చైత్రను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహం జరిగి 11 ఏళ్లు గడిచినా.. మూడు సంవత్సరాల క్రితమే చైత్ర, గజేంద్ర మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరూ చిన్న చిన్న విషయాలపై తరచూ గొడవలు పడేవారు. ఈ సమయంలో చైత్రకు పునీత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గజేంద్రకు తెలియడంతో ఈ విషయాన్ని చైత్ర తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ సమయంలో అందరిముందు అవమానభారంతో చైత్ర తన ప్రియుడిని వదిలేసింది. కానీ చైత్ర బుద్ధి మాత్రం మారలేదు. ఆమె బేలూరుకు చెందిన శివు అనే మరో వ్యక్తి,తో కొత్తగా ప్రేమాయాణం ప్రారంభించింది.
కానీ తన కొత్త ప్రేమ వ్యవహారం గురించి గజేంద్రకు తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో చైత్ర తన కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకుంది. శివు సహాయంతో ఆమె ఈ దారుణమైన పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నించింది. ఆమె భోజనంలో నిద్రమాత్రలు కలిపి, కుటుంబ సభ్యులను చంపేందుకు సిద్ధమైంది. అయితే, గజేంద్ర సకాలంలో ఈ పథకాన్ని గుర్తించడంతో ఈ దారుణం జరగకుండా అడ్డుకున్నాడు. చైత్రను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె ప్రియుడు శివును కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశమైంది. చైత్ర కేసులో.. దారుణ పథకం వెనుక ఉన్న పూర్తి కారణాలను, ఇతర సహాయం ఎవరైనా చేశారా అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: శోభనం రోజు రాత్రి ఏం జరిగింది? ‘హనీమూన్’ ఘటనలో ఊహించని ట్విస్ట్
ఇలాంటిదే ఒక కేసు కేరళలో జరిగింది. “సైనైడ్ కిల్లర్” కేసు పేరుతో అది ఫేమస్. ఆ కేసులో జాలీ జోసెఫ్ అనే మహిళ 14 సంవత్సరాల పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను కొద్ది కొద్దిగా విషం ఇచ్చి చంపింది. చివరికి ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.