OTT Movie : ఒక సాధారణ లోయర్ మిడిల్-క్లాస్ కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో, ఒక రాఫెల్ డ్రాలో రూ.10 లక్షల విలువైన ఎరుపు సుజుకి స్విఫ్ట్ కారును గెలుచుకుంటుంది. ఇది వాళ్ళ జీవితంలో ఒక కొత్త ఆశా కిరణంగా కనిపిస్తుంది. కానీ ఈ కారు ఒక వరం కాదు, ఒక శాపంగా మారుతుంది. కారు కోసం ఒక స్వార్థపరుడైన సోదరుడు, ఒక లంచగొండి పోలీసు ఇన్‌స్పెక్టర్, ఇతర రహస్యమైన వ్యక్తులు పోటీ పడతారు. ఈ గందరగోళంలో ఒక షాకింగ్ రహస్యం బయటపడుతుంది. వాళ్ళు ఈ గందరగోళం నుండి బయటపడగలరా ? లేక పోతే ఈ కారు వారి కుటుంబాన్ని నాశనం చేస్తుందా? కారులో ఉన్న రహస్యం ఏంటి ? ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఇది ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ చెన్నైలోని ఒక లోయర్ మిడిల్-క్లాస్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అగల్య (ఐశ్వర్య రాజేష్) అనే యువతి ఆమె తల్లి లక్ష్మీ (దీపా శంకర్), మూగ సోదరి థెన్మోళి (లక్ష్మీ ప్రియా చంద్రమౌళి), మందుబాబు అయిన తండ్రి (బెడ్‌రిడ్డెన్)తో కలిసి నిరుపేద స్థితిలో జీవిస్తుంది. అగల్య సోదరుడు దురై (కరుణాకరన్) వివాహం తర్వాత కుటుంబం నుండి విడిపోయాడు. ఇతను స్వార్థపరమైన లక్షణాలతో ఉంటాడు. ఒక రోజు, SGC జ్యువెలరీ షాప్ సేల్స్ మేనేజర్ నరేష్ (సతీష్ కృష్ణన్) అగల్యకు ఒక శుభవార్త చెప్తాడు. ఆమె రాఫెల్ డ్రాలో రూ.10 లక్షల విలువైన ఎరుపు సుజుకి స్విఫ్ట్ కారును గెలిచింది. ఈ కారు వారి ఆర్థిక ఇబ్బందులను తీర్చి, థెన్మోళి వివాహానికి డౌరీగా ఉపయోగపడుతుందని వీళ్ళు ఆశిస్తారు.
అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. దురై ఈ కారు తనదేనని, తాను జ్యువెలరీ షాప్‌లో కొనుగోలు చేసిన టికెట్ ద్వారా గెలిచినదని పేర్కొంటూ తిరిగి వస్తాడు. అదే సమయంలో, ఒక లంచగొండి పోలీసు ఇన్‌స్పెక్టర్ కన్నన్ (సునీల్ రెడ్డి) అగల్యపై అనుచిత ఆసక్తి చూపిస్తూ కారు యాజమాన్యంపై దావా వేస్తాడు.
ఈ గందరగోళంలో, థెన్మోళి ఒక షాకింగ్ రహస్యాన్ని బయటపెడుతుంది. కారు ట్రంక్‌లో ఒక శవం ఉంది! ఈ శవం ఎవరిది, ఎలా అక్కడ చేరింది అనేది కథకు మరింత ఉత్కంఠత జోడిస్తుంది. అగల్య, లక్ష్మీ, థెన్మోళి ఈ సమస్యను ఎదుర్కోవడానికి విపరీతమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో ఒక దశలో అగల్య ఇన్‌స్పెక్టర్ కన్నన్‌ను మోసం చేయడానికి ఒక పథకాన్ని రూపొందిస్తుంది. ఈ గందరగోళంలో కారు తమదేనని రెడిన్ కింగ్స్లీ , బ్జోర్న్ సుర్రావ్, షారా అనే వ్యక్తులు పోటీలోకి దిగుతారు. కథలోని ప్రతి పాత్ర తమ స్వంత లాభం కోసం మోసం చేస్తుంది. అగల్య, ఆమె కుటుంబం ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ బుద్ధిని, ధైర్యాన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఒక దశలో అగల్య మీడియాను ఉపయోగించి ఇన్‌స్పెక్టర్ కు బుద్ధి చెప్పే పథకం రూపొందిస్తుంది. చివరికి అగల్య ఈ సమస్యల నుంచి బయటపడుతుందా ? కారులో ఉన్న శవం ఎవరిది ? ఇన్‌స్పెక్టర్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : 16 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… ఊహించని మలుమపులు
ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘సొప్పన సుందరి’ (Soppana Sundari). SG చార్లెస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి IMDbలో 6.2/10 రేటింగ్ ఉంది. ఇందులో ఐశ్వర్య రాజేష్ (అగల్య), లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (థెన్మోళి), దీపా శంకర్ (లక్ష్మీ), కరుణాకరన్ (దురై), సతీష్ కృష్ణన్ (నరేష్), రెడిన్ కింగ్స్లీ, సునీల్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్ కన్నన్), షా రా, బ్జోర్న్ సుర్రావ్ వంటి నటులు నటించారు. జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.