BigTV English

OTT Movie : సినిమా పిచ్చితో పెళ్లి చేసుకునే అమ్మాయి … మొదటి రాత్రే మొగుడికి చుక్కలు

OTT Movie : సినిమా పిచ్చితో పెళ్లి చేసుకునే అమ్మాయి … మొదటి రాత్రే మొగుడికి చుక్కలు

OTT Movie : ఒక రోడ్డు మీద ఒక్కసారిగా పేలుడు జరుగుతుంది. జనం గందరగోళంలో పరుగెత్తుతున్నారు. ఒక చిన్న అబ్బాయి ఒక అమ్మాయిని వెతుకుతూ కంగారుగా అరుస్తున్నాడు. ఒక బస్సు మంటల్లో చిక్కుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ అబ్బాయి 35 ఏళ్ల వయస్సులో మలేషియా నుండి తన గ్రామానికి తిరిగి వస్తాడు. అతను లీలా అనే అమ్మాయిని అనుకోని పరిస్థితుల్లో వివాహం చేసుకుంటాడు. కానీ లీలా ఈ వివాహాన్ని ఏమాత్రం ఇష్టపడదు. అయితే అతను తన భార్య ప్రేమను గెలుచుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తాడు. ఈ ప్రేమ కథలో మూడో వ్యక్తి ఎంట్రీ కూడా ఉంటుంది. ఇప్పుడు అరివు తన భార్య ప్రేమను పొందుతాడా ? లీలా అతన్ని వదిలేస్తుందా? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ అరివు అనే (విజయ్ ఆంటోనీ)35 ఏళ్ల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన యవ్వనాన్ని కుటుంబ ఆర్థిక భద్రత కోసం కష్టపడి, ప్రేమను అనుభవించే అవకాశం కోల్పోతాడు. ఇప్పుడు తన గ్రామానికి తిరిగి వచ్చి, ప్రేమలో పడాలని కలలు కంటాడు. ఈ క్రమంలో లీలావతిని ఆమె తాతయ్య అంత్యక్రియల సమయంలో కలుస్తాడు. లీలాకి నటన మీద ఆసక్తి ఉటుంది. కానీ ఆమె తండ్రి నటనను వ్యతిరేకించడం వల్ల, ఆమె చెన్నైలో ఒక MNCలో ఉద్యోగం వచ్చినట్లు అబద్దం చెబుతుంది. ఆమెకు మద్యం సేవించే అలవాటు కూడా ఉంటుంది. లీలా తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు, అరివు ఆమె వైద్య ఖర్చులకు సహాయం చేస్తాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తాడు. లీలా తన ముగ్గురు స్నేహితులతో కలసి చెన్నైకి వెళ్లడానికి ఒక పథకం వేస్తుంది. ఇంతలో లీలా తండ్రి ఆమె ఏం చేస్తుందో తెలుసుకుని, ఆమెను అరివుతో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆమె కూడా ఇందుకు ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఈ పెళ్ళి ఒక్కటే ఆమెకు చెన్నైకి వెళ్లడానికి ఏకైక మార్గం అవుతుంది. లీలా పట్ల ప్రేమతో అరివు ఈ వివాహానికి అంగీకరిస్తాడు. కానీ లీలా అతని పట్ల దూరంగా ఉంటుంది.


ఇక పెళ్ళి తరువాత వీళ్ళు చెన్నై కి వెళతారు. లీలా అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ లీలా కలలను సాకారం చేయడానికి, అరివు ఆమె స్నేహితులతో కలిసి ఒక సినిమాను నిర్మించడానికి అంగీకరిస్తాడు. అయితే తాను హీరోగా నటిస్తానని కండీషన్ పెడతాడు. అరివుకి నటనలో అనుభవం లేనప్పటికీ, లీలా కోసం తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో విక్రమ్ అనే వ్యక్తిగా లీలాతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి అరివు తన భార్య కోరికను తీరుస్తాడా ? లీలా భర్త పట్ల ప్రేమను చూపిస్తుందా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : సైకాలజిస్ట్ నే తికమక పెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ … సీను సీనుకూ గుండెలు అదరాల్సిందే

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ మూవీ పేరు ‘రోమియో’ (Romeo). 2024 లో వచ్చిన ఈ సినిమాకి వినాయక్ వైతియనాథన్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha) లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాకి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. ఇందులో విజయ్ ఆంటోనీ (అరివు), మిర్నాలిని రవి (లీలా), యోగి బాబు (విక్రమ్), VTV గణేష్ (అరివు మామ), ఇళవరసు, తలైవాసల్ విజయ్ వంటి నటులు నటించారు.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×