BigTV English

Black Diwali for China: మనకు ‘దీపావళి’.. చైనాకు కారు చీకట్లు, ఆ నిర్ణయం ఊహించని దెబ్బకొట్టనుందా?

Black Diwali for China: మనకు ‘దీపావళి’.. చైనాకు కారు చీకట్లు, ఆ నిర్ణయం ఊహించని దెబ్బకొట్టనుందా?

తాజాగా మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ రాబోయే దీపావళిపై కీలక సూచనలు చేశారు. దివాళీ స్వదేశీ సందేశం వెలువరించారు. ప్రతీ సంవత్సరం చెప్పినట్లే త్వరలో రాబోయే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే జరుపుకోవాలన్నారు. గణేష్ నవరాత్రులతో ప్రారంభమైన పండుగల సీజన్‌లో మనమంతా కలిసి దేశీయ ఉత్పత్తులనే వాడదామని అన్నారు. దీని కోసం స్థానికంగా ఎక్కడికక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుక్కుందామని చెప్పారు. అవి, దీపాలు కావచ్చు, మిఠాయిలు కావచ్చు, బాణసంచా కావచ్చు, దుస్తులు కావచ్చు.. ఏదైనా, మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొందామని అన్నారు. మట్టి ప్రమిదల నుండి మనం వాడే ప్రతిదీ భారత తయారీదై ఉండే విధంగా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

నిజానికి పండుగ సీజన్ వచ్చిందంటే, ముఖ్యంగా దీపావళిలో చౌకగా దొరికే మేడ్-ఇన్-చైనా వస్తువులు భారత మార్కెట్‌ను ముంచెత్తుతాయి. కాబట్టి, చైనా మేడ్ మట్టి దీపాలు తక్కువ ధరకు వస్తాయని వాటిని కొనుగోలు చేయవద్దని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. అలాగని, “కేవలం మట్టి దీపాలను కొన్నంత మాత్రాన లోకల్ వస్తువులును కొన్నామని అనుకోడదనీ.. పండుగలకు వాడే ప్రతి వస్తువునూ మీమీ ప్రాంతంలో తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను వాడటమే నిజమైన లోకల్ కోసం వోకల్ అన్నారు. అందుకే, ఈ పండుగల సీజన్‌లో ఈ అంశాన్ని మరింత ఎక్కువగా ప్రచారం చేయాలని కోరారు. పండుగ ఉత్పత్తుల్లో చాలా భారతీయ కళాకారుల చెమటతో తయారు చేయబడ్డాయనీ.. అది భారత గడ్డపై తయారు చేయబడిందని గర్వంగా చెప్పుకుంటూ మన కీర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: కొడుకు పెళ్లికి అంబానీ వేల కోట్లు ఖర్చు పెట్టాడు.. అదంతా ప్రజల సొమ్ము : రాహుల్ గాంధీ

అయితే, ఈ ఏడాది లాగానే పండగల్లో మేడ్ ఇన్ ఇండియా వస్తువులను వాడాలని ప్రతి ఏడాదీ ప్రధాని మోడీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఒక దశాబ్దం పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, కొన్ని సంవత్సరాలుగా చైనీస్ వస్తువులను భారతీయులు భారీగానే తిరస్కరిస్తున్నారు. భారత్, చైనా మధ్య సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో.. ఇటీవల సంవత్సరాల్లో భారతీయులు పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీనితో, భారతదేశంలో పెద్ద పరిశ్రమల నుండి చిన్న దుకాణదారుల వరకు అన్ని విభాగాల్లో మెరుగైన లాభాలు కూడా కనిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా విజయానికి ఇవి దోహదం చేశాయి.

ఈ సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా, ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్-CAIT.. వినియోగదారులు చైనా రాఖీల కంటే స్వదేశీ రాఖీలను ఇష్టపడుతున్నారని పేర్కొంది. “చాలా సంవత్సరాలుగా, దేశంలో దేశీయ రాఖీలు మాత్రమే అమ్ముడవుతున్నాయనీ. ఈ సంవత్సరం కూడా మార్కెట్లో చైనీస్ రాఖీలకు డిమాండ్ లేదని” CAIT ఒక నోట్‌లో తెలిపింది. అలాగే, గత దీపావళి, మేడ్-ఇన్-ఇండియా డెకరేటివ్ లైట్లకు కూడా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన చైనీస్ ఉత్పత్తులకు ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులు గట్టి పోటీని ఇచ్చాయి.

మార్కెట్ డీలర్ల అభిప్రాయం ప్రకారం, భారతీయ ఉత్పత్తులతో పోలిస్తే చైనీస్ ఉత్పత్తులు మోడళ్లు, తక్కువ ధర కారణంగా ప్రజాదరణ పొందాయి. గత దీపావళికి దిగుమతి చేసుకున్న అనేక రకాల చైనీస్ లైట్లు మార్కెట్‌ను ముంచెత్తినప్పటికీ, చాలా మంది వినియోగదారులు భారతీయ అలంకరణ దీపాలను కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, దీనికి కారణం కేవలం దేశభక్తి మాత్రమే కాదు, చైనా వస్తువుల కంటే భారతీయ ఉత్పత్తులు ఎక్కువ మన్నికైనవి. పైప్ లైట్ స్ట్రింగ్స్, బ్యాటరీతో నడిచే డయా లైట్, ఎల్‌ఈడీ లైట్ షాన్డిలియర్స్, ఫ్లవర్ లైట్, ఆలయ అలంకరణ కోసం ప్రత్యేక గోల్డెన్ లైట్, ఎల్‌ఈడీ ‘కలశ’ లైట్ వంటి కొన్ని ప్రధాన వస్తువులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇటీవల కాలంలో, ప్రఖ్యాత భారతీయ కంపెనీలు కూడా చైనీస్ వేరియంట్‌ల మాదిరిగానే ఫ్యాన్సీ లైట్లను విడుదల చేస్తున్నాయి.

Related News

Wedding Invitation Fraud: వాట్సాప్‌లో పెళ్లి ఇన్విటేషన్‌ లింక్.. ఒకే క్లిక్‌తో రూ.1.90 లక్షలు మాయం

Singapore: తండ్రిని పట్టించిన బాలుడు.. సింగపూర్‌లో భారతీయుడికి జైలు, అసలే మేటరేంటి?

CM Chandrababu: టాప్‌లో సీఎం చంద్రబాబు.. చివరలో మమతాబెనర్జీ, ఈ ర్యాంకుల గోలేంటి?

Dharmasthala Twist: ధర్మస్థల కేసులో అసలు ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అందర్నీ పిచ్చోళ్లను చేశాడా?

Dongs Attack Man: రౌండ్ వేసి మరీ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు.. దడ పుట్టిస్తున్న వీడియో

Anil Ambani: అంబానీకి ఊహించని షాక్.. తల్లి ఆస్పత్రిలో ఉండగానే ఇంట్లో సీబీఐ సోదాలు

Big Stories

×