Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఈ మధ్యకాలం లవర్స్ రోడ్లపైకి వచ్చి చిత్ర-విచిత్రాలు చేస్తున్నారు. కారు బానెట్‌పై వేలాడడం మొదలుపెట్టారు. అఫ్ కోర్సు.. అందుకు కారణాలు అనేకం. తాజాగా ఈసారి భార్య వంతైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరట్‌లోని కాజీపూర్ ప్రాంతం నివాసం ఉంటున్నారు సునీత-ఆమె భర్త మయాంక్. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఎలాంటి సమస్యలు ఉన్నాయో అస్సలు తెలీదు. శనివారం సాయంత్రం సునీత భర్త మయాంక్, తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి నగరంలోని ఓ ప్రాంతంలో మోమోలు తింటున్నాడు. ఈ విషయాన్ని మయాంక్ భార్య పసిగట్టింది. ఆ తర్వాత భర్తను గట్టిగా నిలదీసింది. దీంతో భార్య-భర్తల మధ్య నడి రోడ్డు మీద గొడవ జరిగింది. పరిస్థితి గమనించిన మయాంక్.. తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడి నుంచి కారులో వెళ్లేందుకు రెడీ అయ్యాడు.
అందుకు భార్య సునీత ఏమాత్రం అంగీకరించలేదు, చివరకు కారుకు అడ్డుపడింది. మయాంక్.. కారుని పక్కనుంచి పోనిచ్చే ప్రయత్నం చేశాడు. పరిస్థితి గమనించిన సునీత.. కారు బానెట్ పట్టుకుని దాదాపు 100 మీటర్లు ముందుకు వెళ్లింది. ఆ సమయంలో సునీత గట్టిగా కేకలు వేయడం, ఆ దారిని వెళ్లేవారిని అన్నా తనను కాపాడాలంటూ వేడుకోవడం మొదలైంది. ఈ తతంగానికి సంబంధించిన వీడియోలో రికార్డు అయ్యింది. చివరకు స్థానికులంతా కలిసి మయాంక్‌కు కారును ఆపేశారు.
ఈ వ్యవహారంపై సునీత.. తన భర్త మయాంక్ తోపాటు గాళ్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసు.. లు సునీత భర్త మయాంక్, గాళ్‌ఫ్రెండ్ మహీ వర్మను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మాటల వాగ్వాదం తర్వాత భర్త.. తన భార్యను చంపే ఉద్దేశంతో ఆమెపైకి వాహనం నడపడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న UP-15ER3086 రిజిస్ట్రేషన్ నంబరు గల టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం
कार के बोनट पर पत्नी लटकी हुई है। पति अपनी गर्लफ्रेंड के साथ अंदर बैठा है। दरअसल, पत्नी ने दोनों को एकसाथ पकड़ लिया। वो कार के आगे खड़ी हो गई। पति ने कार चलाई तो पत्नी बोनट पर लटकी रह गई।
📍मेरठ, उत्तर प्रदेश pic.twitter.com/VA2WZkgOQP
— Sachin Gupta (@Sachingupta) October 4, 2026