E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని  పార్థు పసిగడతాడా..?    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ ప్లాన్‌ ప్రకారం రాథోడ్‌, అమర్‌ కు ఫోన్‌ చేసి రేపే పార్థును చంపబోతున్నానని చెప్పగానే.. అమర్‌ కోపంగా ఎవడ్రా నువ్వు అంటూ అడిగితే.. రాథోడ్‌ తాను ఎవరైతే ఏంటి..? రేపు నన్ను చూస్తావు కదా..? వీలైతే నీ ఫ్రెండ్‌ను నా నుంచి ఇప్పుడు కాపాడుకో చూస్తాను అంటూ చాలెంజ్‌ చేసి కాల్‌ కట్‌ చేస్తాడు. కాల్‌ కట్‌ చేయగానే.. రాథోడ్ భయంగా ఏంటి మిస్సమ్మ కలలో కూడా ఊహించని పని నాతో చేయించావు.. నేను సార్‌ ను బెదిరించడం ఏంటి..? అంటే మనం మంచి కోసమే చేశాము రాథోడ్‌. పార్థు ప్రాణాలు కాపాడటమే మనకు కావాలి అంటూ మిస్సమ్మ, రాథోడ్‌కు చెప్తుంటే..

ఇంట్లోంచి అమర్‌, మిస్సమ్మను పిలుస్తాడు. అమర్‌ మాటలు విన్న మిస్సమ్మ చూడు రాథోడ్‌ ఆయన ఇప్పుడు ఫోన్‌ కాల్‌ గురించే మాట్లాడతారు.. ఎక్కడ మనం టంగ్‌ స్లిప్‌ కావొద్దు అంటూ రాథోడ్‌ ను వెళ్దాం పద అంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్లగానే.. అమర్‌ వెంటనే నేను ఢిల్లీకి వెళ్తున్నాను అంటాడు. మిస్సమ్మ ఆపుకోలేక ఎందుకండి ఎవరైనా ఫోన్‌ చేసి బెదిరించారా..? అంటుంది. రాథోడ్‌, అమర్‌ షాక్‌ అవుతారు. అమర్‌ అదేంటి అంత కరెక్టుగా ఎలా చెప్తున్నావు అంటే.. నాకు ఉదయం నుంచి ఇలాగే ఉంది కదండి.. అంతా అపశకునమే జరుగుతుంది అని చెబితే.. అవును భాగీ నీ భయమే నిజం అయింది అంటూ తనకు రాథోడ్‌ చేసిన కాల్ గురించి చెప్పి వెంటనే ఢిల్లీ బయలుదేరాలి అంటాడు. మిస్సమ్మ కూడా వస్తానంటుంది. ఎందుకని వద్దని అమర్‌ చెబితే.. రానివ్వండి సార్‌ అంటూ రాథోడ్‌ చెప్పగానే.. సరే అయితే వెళ్లి నువ్వు లగేజీ రెడీ చేయ్‌ రాథోడ్‌ నువ్వు ఫ్లైట్ టికెట్స్ బుక్‌ చేయ్‌ అంటాడు.

Advertisement

విచిత్రగుప్త పార్థు ప్రమాదంలో ఉన్నాడని కాపాడటానికి భూలోకం వెళ్తుంటే.. నారదుడు చూసి వచ్చి ఆపి ఎక్కడకు వెళ్తున్నావు అని అడుగుతాడు. అందుకు గుప్త బాధగా కింద భూలోకంలో పార్థు ప్రమాదంలో ఉన్నాడని పార్థు చనిపోతే నా సోదరి అరుందతి భాదపడుతుంది అందుకే పార్థును కాపాడాలని భూలోకం వెళ్తున్నాను అని చెప్తాడు. నారదుడు నవ్వుతూ పార్థును కాపాడటానికి అమరేంద్ర, భాగీ బాలిక వెళ్తున్నారు అటు చూడు అంటాడు. కింద అమర్, భాగీ ఢిల్లీకి వెళ్లేందుకు కారులో ఎయిర్‌ఫోర్ట్‌కు వెళ్తుంటారు. వాళ్లను చూసిన గుప్త సంతోషంగా ఫీలవుతుంటే.. నారదుడు గుప్తకు షాక్‌ ఇస్తాడు. భాగీ బాలిక, అమరేంద్ర మాత్రమే కాదు గుప్త నువ్వు వెళ్లినా ఆ పార్థును కాపాడలేవు అంటాడు.

అందుకు గుప్త షాక్‌ అవుతాడు. అతని మరణం తథ్యం అని భవిష్యవాణిలో లికించబడి ఉన్నది కదా అంటాడు. అందుకు గుప్త అనాడు సత్యవంతుడి మరణం కూడా తథ్యం అని భవిష్యవాణిలో లికించబడి ఉన్నది అయిననూ సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకోలేదా..? మార్కండేయుడికి ప్రాణం పెట్టిన విషయం మర్చిపోయారా..? అంటూ చరిత్ర చెప్తుంటే.. దేవుళ్లు ప్రాణాలు కాపాడతారు కానీ వీళ్లు ఇప్పుడు అల్ప మానవులు కదా.. అయినా నువ్వు నీ కర్తవ్యమును నిర్వర్తించుము రేపు పార్థు ఆత్మను తీసుకొచ్చేందుకు మీ ప్రభువుల వారు యమభటులను పంపెదరు. అప్పుడు అంతా చూచెదవు  అంటాడు నారదుడు. అయిత సరే మహర్షి రేపు భాగీ సంకల్పం గెలిచెనో.. ఆ దుష్ట మనోహరి కోరిక నెరవేరునో చూచెదము అంటాడు.

Advertisement

కింద ఢిల్లీలో కులుమనాలిలో ఉన్న మనోహరి రేపు ఆ సీతారాంను ఎలాగైనా డైవర్ట్‌ చేసి పార్థు ఒక్కడినే సైట్‌కు తీసుకెళ్లి ఎలాగైనా చంపేయాలి. ఎలాంటి ఆధారం దొరక్కూడదు. నేను సేఫ్‌గా అమరేంద్ర ఇంటికి వెళ్లాలి. అంటూ ఆలోచిస్తుంది. వెనక నుంచి వచ్చి పార్థు భుజం మీద చేయి వేయగానే.. మనోహరి ఉలిక్కిపడుతుంది. పార్థు ఏంటి మను అంతలా ఉలిక్కిపడ్డావు అంటే ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అంటూ మనోహరి చెబితే.. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం అయింది. నన్ను ఎలా పైకి పంపాలో ఆలోచిస్తున్నావు కదా అంటాడు. పార్థు మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×