E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 
Advertisement

Ninnu kori serial today Episode: తల తిరుగుతూ కింద పడబోయిన సామ్రాట్‌ను చంద్ర పట్టుకుంటుంది. సోఫాలో కూర్చోబెట్టి తన మాటలతో సామ్రాట్‌ను కూల్‌ చేస్తుంది. మీరేం ఎక్కువ ఆలోచించొద్దు అంటూ చెప్తూ.. మీరు ఇప్పుడు ఏమీ ఆలోచించొద్దు రెస్ట్‌ తీసుకొండి అని చెబుతూ.. సామ్రాట్‌ను గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టమని మదన్‌కు చెప్పగానే.. మదన్‌, సామ్రాట్‌ను గదిలోకి తీసుకెళ్తాడు. శ్రీజ ఏడుస్తుంటే.. నీలగిరి వెళ్లి ఓదారుస్తాడు. బావ నీ వాడే.. బావతో నీకు పెళ్లి జరుగుతుంది. అత్త నీకు మాటిచ్చింది కదా..? అంటూ భరోసా ఇచ్చి నీలగిరి కూడా దాక్షాయణితో ఎమోషనల్‌ అవుతాడు. శ్రీజను ఏడవొద్దని చెప్తాడు.

సామ్రాట్‌ను రూంలోకి తీసుకెళ్లిన మదన్‌ బ్రో మీరు కూల్‌గా ఉండండి చంద్ర చెప్పినట్టు ఏ టెన్షన్‌ పెట్టుకోవద్దు.. అంటూ చెప్తుంటే.. ఈ డిస్టర్బెన్స్‌కు కారణం ఏంటో తెలియాలి మదన్‌. అసలు నాకు ఏమైపోతుందో తెలియడం లేదు. దీని వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.. అనగానే.. ఎవరు ఇబ్బంది పడటం లేదు బ్రో మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మీరు ప్రాణంగా చూసుకునే అమ్మ, ప్రేమగా చూసుకునే నాన్న మీ ఫ్యామిలీ అందరికీ మీరంటే చాలా ఇష్టం బ్రో మీకున్న బంధాలు ఎంత మధురంగా ఉంటాయో నేను చూశాను అంటూ చెప్తుంటాడు. అప్పుడే దాక్షాయణి, చంద్ర వస్తారు.

Advertisement

సారీ అమ్మ నా కోసం మీరు సఫర్‌ అవుతున్నారు అంటే.. అదేం లేదురా మేము నీకోసం ఎంతైనా భరిస్తాం అంటుంది దాక్షాయణి. నువ్వు మా గురించి ఆలోచించకు మేమంతా నీతోనే ఉన్నాము.. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్పు మేము నిన్ను ప్రేమగా చూసుకుంటున్నామా..? లేదా అన్నది క్లారిటీ ఇవ్వు అంటుంది. చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కానీ అంటూ గతంలోకి వెళ్లబోతుంటే.. అక్కడే ఆగు గతం గురించి గట్టిగా ఆలోచించకు అంటూ నీకు గతం గుర్తుకు రాకూడదు వస్తే నాకు మళ్లీ నిన్ను చంపాల్సిన అవసరం వస్తుంది అని మనసులో అనుకుంటుంది దాక్షాయణి.

తర్వాత వీలైనంత త్వరగా విరాట్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాలని డిసైడ్‌ అవుతారు. ఇన్నాళ్లు నీలగిరి హత్యాయత్యం చేశాడనుకున్నాం కానీ ఆయనకు సామ్రాట్‌ గారిని చంపే ఉద్దేశం లేదు. ఆయన ఏదో బిజినెస్‌లో తప్పు చేశాడు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ చంద్ర చెప్పగానే.. అయితే ఈ ఇంటికి ఎవరో క్లోజ్ గా అబ్జర్వ్‌ చేస్తున్నారు అంటే ఇంకెవరై ఉంటారు మదన్‌ అంటుంది చంద్ర.

Advertisement

జీవన్‌కు తన ఫ్రెండ్‌ ఫోన్‌ చేయగానే జీవన్‌ భయంగా ఏరా వాళ్లు దొరికారా..? అని అడుగుతాడు. లేదని ఫ్రెండ్ చెప్పగానే..అరేయ్‌ వాళ్ల అమ్మాయి నా వల్ల సూసైడ్‌ చేసుకుంది. ఆ విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పాలని వాళ్లు తిరుగుతున్నారు. అంటూ చెప్తూ భయపడుతుంటే దాక్షాయణి వచ్చి ఏంటి జీవన్‌ కంగారుపడుతున్నావు ఏమైంది అని అడుగుతుంది. జీవన్‌ కాల్‌ కట్‌ చేసి ఏం లేదు అమ్మా అంటాడు.. దాక్షాయణి మాత్రం నిన్ను కాపాడటం కోసమేనా మీ అన్నయ్యను చంపాలని చూశాను. ఇప్పుడు నువ్వు వెతుకుతున్న ఆ అమ్మాయి వాళ్ల ఫ్యామిలీని బెదరించి దూరంగా వెళ్లిపోయేలా చేశాను అని మనసులో అనుకుంటుంది.

నేను నీకు సపోర్టుగా ఉన్నాను అని నీకు తెలిస్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు అందుకే బయటకు నేను చెప్పడం లేదు. నా సొంత అన్నకూతురు పెళ్లి చేసుకోవానుకున్న సామ్రాట్‌ను కూడా నేను చంపాలనుకున్నాను అంత ప్రేమరా నీ మీద అని మనసులో అనుకుంటుంది. అప్పుడే జీవన్‌ తనకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పగానే.. దాక్షాయణి వెళ్లిపోతుంది. అన్నయ్యకు గతం గుర్తుకు రానంత వరకే నేను సేఫ్‌. నా చేతికి మట్టి అంటకుండా అన్నయ్యను లేపేయాలి అని జీవన్‌ ప్లాన్‌ చేస్తాడు.

శ్రీజ డల్లుగా కూర్చుని సామ్రాట్‌ గురించి ఆలోచిస్తుంటే.. మదన్‌ వెళ్లి మళ్లీ రెండు మూడు ప్లాన్లు చెప్తాడు. దీంతో శ్రీజ ఎగిరి గంతేస్తుంది. ఈ దెబ్బతో మా బావ నాతో పెళ్లికి రెడీ అవుతాడు అనుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

Big Stories

Advertisement
×