Keralam: ఓ మహిళను.. ప్రియుడు భార్య అత్యాచారం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తన భర్తతో ఎఫైర్ పెట్టుకుందని భావించింది అతడి భార్య. దీనికి సరైన బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం ఓ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంది. లాడ్జి నుంచి ఆ మహిళ, ప్రియుడ్ని కిడ్నాప్ చేశారు. దారిలో ప్రియుడ్ని వదిలేసి ఆ మహిళను మరో చోటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో మైనర్ ఉన్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మలప్పురం జిల్లా నిలంబూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళకు గుణశేఖర్ అనే ప్రియుడు ఉన్నాడు. అతడు సొంతూరు తమిళనాడులోని తిరుప్పూర్ ప్రాంతం. ఇద్దరు కలిసి త్రిస్సూర్‌లోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో దిగారు. ఈ విషయంలో గుణశేఖరన్ భార్య దేవి చెవిలో పడింది. ఎలాగైనా ఆ మహిళకు సరైన బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యింది. భర్త మొబైల్ ఫోన్ ట్రాక్ చేసిన భార్య, లాడ్జిలో ఉన్నట్లు గుర్తించింది. ఏ మాత్రం ఆలోచించలేదు. ఈ క్రమంలో ఓ ముఠాతో సంప్రదింపులు జరిపింది.
డీల్ సెట్ అయిన తర్వాత సెప్టెంబర్ 22న పోలీసుల వేషంలో దేవి, మరో నలుగురు వ్యక్తులు లాడ్జి గదిలోకి ఎంట్రీ ఇచ్చారు. సదరు మహిళ-గుణశేఖరన్‌ను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి కారులో గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో గుణశేఖరన్ కాళ్లు, చేతులు విరిచారు. అతడ్ని తిరుప్పూర్‌లోని ఓ ఆసుపత్రి బయట వదిలేశారు. ఆ తర్వాత బాధితురాల్ని మరో కారులోకి మార్చారు. దేవి పంపిన గ్యాంగ్ సభ్యులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
చివరకు గ్యాంగ్ సభ్యుల నుంచి తప్పించుకున్న బాధితురాలు, నిలంబూర్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై త్రిస్సూర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ప్రధాన నిందితురాలు దేవి, థామస్ ప్రియదర్శన్ దేవ, రఘుపతి రాజా, శంకర్, పాల్‌రాజ్ లను కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేశారు. ఈ ఘటనను సుపారీ కేసుగా పోలీసులు పరిగణిస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారందిరకీ జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పరారీలో ఓ మైనర్ కోసం గాలింపు చేపట్టారు.
ALSO READ: అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే