BigTV English

National:సమస్యల ప్రభం‘జనం’: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

National:సమస్యల ప్రభం‘జనం’: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

World population Day on July 11(Telugu news updates):


నేటి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్యలలో ఒకటి జనాభా పెరుగుదల. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత దేశం అవతరించింది. 2023కు ముందు చైనా ప్రధమ స్థానంలో ఉంటే భారతదేశం ఆ స్థానాన్ని అధిగమించింది. యావత్ ప్రపంచ జనాభాను యావరేజ్ గా తీసుకుంటే భారత్, చైనా కలిపి 37 శాతం ఉంది. అంతకంతకూ పెరిగిపోతున్న జనాభా వలన కలిగే దుష్పరిణామాలు, అనర్థాలు..వాటిపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఐక్యరాజ్య సమితి 1989 సంవత్సరంలో ప్రపంచ జనాభా దినోత్సవం ప్రారంభించింది.

మరణాల రేటు తక్కువ


భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో జననాల రేటు 47 శాతం ఉంది. అయితే మరణాల రేటు 44 శాతం ఉంది. అంటే జనాభా ఆయుష్షు శాతం పెరిగింది. ప్రస్తుత భారత జనాభా 144 కోట్లకు పైగా చేరుకుంది. బ్రిటీష్ కాలం నుంచే భారత దేశం ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇక్కడి సంపదనంతా బ్రిటీష్ వాళ్లు తరలించుకుపోయారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికే భారతదేశం పేదరికపు కోరల్లో ఇరుక్కుపోయింది. దాదాపు 70 శాతం ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు చేసేవారంతా వ్యవసాయాధిరిత పనులే తప్ప వారికి మరేదీ తెలియదు. పారిశ్రామికంగా మన దేశం చాలా ఆలస్యంగానే కళ్లు తెరిచింది. పారిశ్రామిక విప్లవం పుణ్యమా అని పరిశ్రమలు అనేకంగా వెలిశాయి.

నిరుద్యోగ భారతం

నిరుద్యోగుల సంఖ్య భారీగానే తగ్గుతున్నప్పటికీ..పెరుగుతున్న జనాభా దానిని డామినేట్ చెయ్యడంతో జనాభా పెరిగినంత వేగంగా ఉపాధి లభ్యం కాక ఇంకా చాలా మంది నిరుద్యోగ రక్కసితో పోరాడుతునే ఉన్నారు. అందుకే విదేశాలలో కొలువుల కోసం ఎగబడుతున్నారు. విదేశాలలో కొలువులు కరోనాకు ముందు దాకా బాగానే ఉన్నా..ప్రస్తుత పరిస్థితిలో ఆయా దేశాలకు కూడా భారంగా తయారవడంతో రోజుకు వేల సంఖ్యలో ఉద్యోగాలు పోగొట్టుకుని తిరిగి భారతదేశానికే వస్తున్నారు. ఇక పెరిగిన జనాభాతో పేదరికం కూడా పోటీపడుతోంది. ఇలాగే పెరిగిపోతున్న జనాభాను నియంత్రింలేకపోతే ముందు ముందు చాలా అనర్థాలు చోటుచేసుకుంటాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగినవిధంగా ఆహార సరఫరా జరగాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం దారుణంగా విఫలమవుతూ వస్తున్నాయి.

ఇప్పటికీ వ్యవసాయాధారితమే..

అంతకంతకూ పెరిగిపోతున్న జనాభాకు తగిన వనరులు సమకూర్చుకోగలగాలి. ఇప్పటికీ భారతదేశంలో సగానికి పైగా జనాభా వ్యవసాయ ఆధారితంగానే బతుకుతున్నారు. వ్యవసాయం కూడా చాలా ఒడిదుడుకులతో నడుస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్న ఆగమైపోతున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడంకూడా గూగుల్ లో చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పారిశుధ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సరైన శుభ్రత పాటించకపోవడంతో రోగాలు కూడా పెరిగిపోతూ సమస్యగా మారుతోంది. ఇలా చూసుకుంటే జనాభాతో పాటే పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అపరిశుభ్రం తదితర సమస్యలన్నీ ఒకదానికి మరొకటి తోడవుతున్నాయి. కేవలం కొంత మంది దళారులు మాత్రమే లబ్దిపొందుతున్నారు. పేదరికంతో ఉండేవారు అలాగే ఉంటున్నారు. చివరకు స్మశాన వాటికలు కూడా ఖాళీలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే ఓ సినీ మహాకవి ఇలా అన్నాడు..ఎదగడానికెందుకురా తొందర..ఎదర బతుకంతా చిందరవందర అంటూ ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితమే జనాలను హెచ్చరించాడు. జనాభా పెరగం అనేది వరం కాదు..శాపం అని గ్రహించాలి.

Tags

Related News

Delhi News: షాకింగ్.. ఢిల్లీలోని ఆ మూడు షాపింగ్ మాల్స్ మూసివేత.. నెక్ట్స్ హైదరాబాద్?

Karur Stampede: టీవీకే పంతం నెగ్గింది.. కరూర్‌ తొక్కిసలాట ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం

Bihar News: బతికుండగానే చితిపైకి పెద్దాయన.. అంతా కళ్లతో చూశాడు, అసలు మేటరేంటి?

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Big Stories

×