OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి లెక్కలేనన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మూవీ లవర్స్ ఇంకా సంక్రాంతి మూవీలకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చివరగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి బ్రాహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. సినిమా రిలీజ్ అయ్యి నెల అయినా క్రేజ్ తగ్గలేదు. ఓటీటీ లో ఎప్పుడు చూస్తమా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక లవర్స్ డే సందర్బంగా నేడు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటుగా ఓటీటీ లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో సక్సెస్ అవ్వని మూవీ కూడా ఓటీటీలో సక్సెస్ టాక్ అందుకుంటుంది. అందుకే ఓటీటీ సంస్థలు కూడా కొత్త కంటెంట్ సినిమాలను సినీ ప్రియులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. థియేటర్లలోకి రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ శుక్రవారం ఓటీటీలో సినీ ప్రియులను అలరించేందుకు బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కరోజే 10 స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్, ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్స్, కామెడీ ఇలా అన్ని రకాల జోనర్స్‌లో సినిమాలు ఉన్నాయి.. ఆ సినిమా ఎక్కడా? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూడాలి..
ఇవాళ పది వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఫిల్మ్ ధూమ్ ధామ్, తెలుగు ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీ పొట్టేల్ వంటి ఇంట్రెస్టింగ్ మూవీలు కూడా రిలీజ్ అవుతున్నాయి.. ముఖ్యంగా నేడు సినిమాలన్ని కూడా నెట్ ఫ్లిక్స్ లోనే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
నెట్ ఫ్లిక్స్..
*. ధూమ్ ధామ్ ( తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 14
*. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14
*. ప్యార్ కా ప్రొఫెసర్ (హిందీ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 14
*. మనోరాజ్యం (మలయాళ బోల్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 14
*. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (తెలుగు రియాలిటీ డ్యాన్స్ షో)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 14
*. పొట్టేల్ (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- ఫిబ్రవరి 14
*. ప్యార్ టెస్టింగ్ (హిందీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 14
*. సబ్‌సర్వియన్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 14
*. మెలో మూవీ ( తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
*. ఐయామ్ మ్యారీడ్.. బట్! (కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14
Also Read : పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. పరువు తీసేశాడుగా..
ఇవే కాదు కొన్ని సినిమాలు సడెన్ గా వచ్చి జాయిన్ అవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు దాదాపు 10 సినిమాలు స్ట్రీమింగ్ వచ్చాయి. 7 స్పెషల్ షోలు కాగా అందులో 4 మూవీలను అస్సలు మిస్ అవ్వొద్దు.. అలాగే ఇవాళ థియేటర్లలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను చూసి వాలంటైన్స్ డే ను ఎంజాయ్ చెయ్యండి.