E-Paper
Advertisement

భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్

భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్
Advertisement

Sci-Fi Time Travel Series OTT : భవిష్యత్తులో ప్రపంచం దాదాపు ఖాళీ అయిపోయింది. కోట్లాది మంది ప్రాణాలు తీసిన వైరస్‌ కారణంగా మనుషులు భూమి పైభాగంలో కాకుండా భూగర్భంలో బతుకుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఓ ఖైదీని గతంలోకి పంపిస్తారు. కానీ గతాన్ని మార్చే ప్రయత్నంలో అతను ఎదుర్కొనే ప్రతి సంఘటన భవిష్యత్తుతోనే ముడిపడి ఉంటుందని తెలుస్తుంది. ఇలా టైమ్ ట్రావెల్, వైరస్, మిస్టరీ, విధిని మార్చే పోరాటంతో సాగే సై-ఫై థ్రిల్లర్ సిరీస్ ’12 మంకీస్’ (12 Monkeys). మరి ఈ ఇంట్రెస్టింగ్ సినిమా డిజిటల్ గా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా లేదా ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

2043లో జేమ్స్ కోల్ ఓ ఖైదీ. అతను జీవిస్తున్న ప్రపంచం మనకు తెలిసిన భూమి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపించిన ఘోరమైన వైరస్ వల్ల సుమారు ఏడు బిలియన్ల మంది చనిపోతారు. మిగిలినవాళ్లు భూగర్భ ప్రాంతాల్లోనే జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ వైరస్ ఎలా వ్యాపించింది, దాని మూలం ఎక్కడుందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు అత్యంత కీలకంగా మారుతుంది. ప్రాజెక్ట్ స్ప్లింటర్ అనే టైమ్ ట్రావెల్ ప్రయోగం ద్వారా కోల్‌ ను గతంలోకి పంపాలని నిర్ణయిస్తారు.

Advertisement

అతని లక్ష్యం వైరస్ వ్యాప్తికి కారణమైన సంస్థను గుర్తించడం. ఆ సంస్థ పేరు ఆర్మీ ఆఫ్ ది ట్వెల్వ్ మంకీస్ . కోల్ మొదట 2015లోకి వెళ్లి వైరాలజిస్ట్ డాక్టర్ క్యాసాండ్రా “క్యాసీ” రైలీని కలుస్తాడు. భవిష్యత్తు గురించి అతను చెప్పే విషయాలు క్యాసీకి మొదట పిచ్చి మాటల్లా అనిపిస్తాయి. కానీ కొంతకాలానికి కోల్ చెప్పిన విషయాల్లో నిజం ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఇక కోల్ ప్రయాణం కేవలం ఒక వైరస్ మూలాన్ని వెతకడంతో ఆగదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్తులో తనకు తెలిసిన పరిణామాలతో ఎలా ముడిపడి ఉన్నాయో అతనికి అర్థమవుతుంది. ప్రతి సారి టైమ్‌లైన్‌ లో మార్పు చేయడానికి ప్రయత్నించినప్పుడు మరో కొత్త సమస్య ఎదురవుతుంది.

క్యాసీ కూడా కోల్ ప్రయాణంలో కీలక భాగస్వామిగా మారుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడే నమ్మకం, వైరస్ వెనుక ఉన్న కుట్ర, ఆర్మీ ఆఫ్ ది ట్వెల్వ్ మంకీస్ టార్గెట్ కథలో కీలక మలుపులు తీసుకొస్తాయి. గతాన్ని మార్చితే భవిష్యత్తు మారుతుందా ? లేక భవిష్యత్తులో జరగాల్సినదే గతాన్ని కూడా నడిపిస్తుందా ? అనే డౌట్ వస్తుంది సిరీస్ ని చూస్తుంటే.

Advertisement

అసలు కోల్ వెతుకుతున్న వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? ఆర్మీ ఆఫ్ ది ట్వెల్వ్ మంకీస్ వెనుక ఉన్న నిజమైన శక్తి ఎవరు ? గతంలో చేసిన ఒక్క చిన్న మార్పు భవిష్యత్తును కాపాడుతుందా లేక మరింత ప్రమాదంలోకి నెడుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ మైండ్-బెండింగ్ టైమ్ ట్రావెల్ జర్నీని చూడాల్సిందే.

Also Read : ట్రిప్పుకెళ్లిన ఫ్యామిలీని తగులుకునే నలుగురు సైకోలు… విచిత్రమైన కండిషన్… నెక్స్ట్ లెవెల్ మైండ్-బెండింగ్ హారర్ థ్రిల్లర్

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

’12 మంకీస్’ 2015లో ప్రారంభమైన సై-ఫై థ్రిల్లర్ సిరీస్. ఆరోన్ స్టాన్‌ఫోర్డ్, అమాండా షుల్, బార్బరా సుకోవా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సిరీస్ మొత్తం టైమ్ ట్రావెల్, వైరస్, ప్యారలల్ టైమ్‌లైన్స్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాల చుట్టూ సాగుతుంది. ఇది వరకు ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అయ్యేది. ఇప్పుడు Google Play Moviesలో మాత్రమే ఈ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే తెలుగు ఆడియో లేదు. ఇంగ్షీషులోనే చూడాల్సి ఉంటుంది.

 

Related News

అయ్యబాబోయ్ ఆ అద్దంలో డెవిల్ ఉందంట… సీక్రెట్ టెస్ట్ చేయబోతే మైండ్ బ్లాకయ్యే సీన్స్… వైరల్ అవుతున్న హారర్ మూవీ

ట్రిప్పుకెళ్లిన ఫ్యామిలీని తగులుకునే నలుగురు సైకోలు… విచిత్రమైన కండిషన్… నెక్స్ట్ లెవెల్ మైండ్-బెండింగ్ హారర్ థ్రిల్లర్

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?

పిన్ ను తాకితే ఫ్యూచర్ వరల్డ్ లోకి… పాప సాహసం చూస్తే సైలెంట్ గా ఉండలేరు… క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్… వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్

ప్రపంచం అంతమైనా తగ్గని ట్రబుల్స్… మంచు ప్రపంచంలో బిక్కుబిక్కుమంటూ… చలిజ్వరం తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×