E-Paper
Advertisement

ట్రిప్పుకెళ్లిన ఫ్యామిలీని తగులుకునే నలుగురు సైకోలు… విచిత్రమైన కండిషన్… నెక్స్ట్ లెవెల్ మైండ్-బెండింగ్ హారర్ థ్రిల్లర్

ట్రిప్పుకెళ్లిన ఫ్యామిలీని తగులుకునే నలుగురు సైకోలు… విచిత్రమైన కండిషన్… నెక్స్ట్ లెవెల్ మైండ్-బెండింగ్ హారర్ థ్రిల్లర్
Advertisement

Psychological Horror Thriller OTT : ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా వెకేషన్ కోసం అడవిలోని ఓ రిమోట్ క్యాబిన్ ‌కు వెళ్తుంది. అక్కడికి ఒక్కసారిగా నలుగురు అపరిచితులు ఆయుధాలతో రావడంతో ఆ ప్రశాంతత మొత్తం చెదిరిపోతుంది. వాళ్లు డబ్బు కోసం రాలేదు… ప్రతీకారం కోసం కూడా కాదు. ప్రపంచాన్ని కాపాడాలంటే ఆ కుటుంబంలోని ఒకరు తమ ప్రాణాలు త్యాగం చేయాల్సిందేనని చెబుతారు. నమ్మలేని ఈ మాటలతో మొదలైన రాత్రి, బయట జరుగుతున్న విపత్తులతో పాటు కుటుంబం తీసుకోవాల్సిన అసాధ్యమైన నిర్ణయాన్ని ముందుకు తెస్తుంది. కుటుంబ బంధం, అపోకలిప్స్ భయం, మైండ్ గేమ్‌ను కలగలిపి తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘నాక్ ఎట్ ది క్యాబిన్’ (Knock at the Cabin). మరి ఈ సైకో థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఎరిక్, ఆండ్రూ తమ ఏడేళ్ల కూతురు వెన్ తో కలిసి పెన్సిల్వేనియాలోని అడవుల్లో ఉన్న ఓ మారుమూల క్యాబిన్‌ కు వెకేషన్ కోసం వస్తారు. చుట్టూ ఎవరూ కనిపించని ఆ ప్రదేశంలో వెన్ ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో లియోనార్డ్ అనే భారీ కాయుడైన వ్యక్తి ఆమె దగ్గరకు వస్తాడు. మొదట అతను ప్రమాదకరంగా అనిపించడు. కానీ అతని మాటల్లో ఏదో వింత ఉంటుంది. కొద్దిసేపటికే లియోనార్డ్‌ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు క్యాబిన్ దగ్గరకు వస్తారు. సబ్రినా, అడ్రియానా, రెడ్‌మండ్ తో కలిసి వారు ఇంట్లోకి చొరబడి… ఎరిక్, ఆండ్రూలను కట్టేస్తారు. తమకు ఈ కుటుంబంపై వ్యక్తిగత శత్రుత్వం లేదని చెబుతూనే, వాళ్ల ముందు ఓ భయంకరమైన షరతు పెడతారు.

Advertisement

తాము గత వారం రోజులుగా కొన్ని విచిత్రమైన దర్శనాలు చూస్తున్నామని ఆ నలుగురు చెబుతారు. ప్రపంచం అంతం కాబోతోందని వారికి ముందుగానే కనిపించిందట. సముద్రాలు ఉప్పొంగడం, మహమ్మారి వ్యాపించడం, ఆకాశం నుంచి వచ్చే భారీ విపత్తులు… ఒక్కొక్కటిగా ప్రపంచాన్ని నాశనం చేసే సంఘటనలు జరుగుతాయని వారు నమ్ముతారు. వాటిని ఆపడానికి ఒకే మార్గం ఉందని చెబుతారు. ఎరిక్, ఆండ్రూ, వెన్ ముగ్గురిలో ఒకరు స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేయాలి. అలా జరిగితే ప్రపంచాన్ని కాపాడే అవకాశం ఉంటుందని లియోనార్డ్ అంటాడు. కానీ కుటుంబం అతని మాటలను నమ్మదు. వాళ్లు దీన్ని ఓ పిచ్చి ముఠా చేసిన దాడిగానే భావిస్తారు.

కానీ కుటుంబం తీసుకునే ప్రతి నిర్ణయం తర్వాత బయట ప్రపంచంలో ఓ విపత్తు జరుగుతుండటంతో పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. చివరకు ఎరిక్, ఆండ్రూ తమ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తీసుకునే నిర్ణయమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితికి చేరుతుంది. నలుగురు అపరిచితులు నిజంగానే ఏదో పెద్ద ప్రమాదాన్ని ముందుగానే చూశారా ? లేక కుటుంబాన్ని మానసికంగా విరగ్గొట్టేందుకు ఇదంతా చేస్తున్నారా ? మరి వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : పిన్ ను తాకితే ఫ్యూచర్ వరల్డ్ లోకి… పాప సాహసం చూస్తే సైలెంట్ గా ఉండలేరు… క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ

ఏ ఓటీటీలో చూడొచ్చు?

‘నాక్ ఎట్ ది క్యాబిన్’ ఎం. నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. 2023లో వచ్చిన ఈ సినిమాలో డేవ్ బటిస్టా, జోనాథన్ గ్రోఫ్, బెన్ ఆల్డ్రిడ్జ్, క్రిస్టెన్ కుయ్ తదితరులు నటించారు. భారత్‌లో ఇది JioHotstarలో అందుబాటులో ఉండటంతో పాటు Prime Videoలో రెంట్ ఆప్షన్‌లో కూడా ఉంది. అయితే ఓటీటీలో ఇంగ్షీషులోనే ఉంది.

Tags

Related News

భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?

పిన్ ను తాకితే ఫ్యూచర్ వరల్డ్ లోకి… పాప సాహసం చూస్తే సైలెంట్ గా ఉండలేరు… క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్… వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్

ప్రపంచం అంతమైనా తగ్గని ట్రబుల్స్… మంచు ప్రపంచంలో బిక్కుబిక్కుమంటూ… చలిజ్వరం తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్

బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×