E-Paper
Advertisement

కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు

కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు
Advertisement

Ghost Thriller on OTT: దెయ్యాలు ఉన్నాయని తెలిసినా వాటిని వెతుక్కుంటూ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తే ? పైగా అక్కడ జరుగుతున్న భయంకరమైన విషయాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలనుకుంటే ? మొదట కంటెంట్ కోసం వెళ్లిన వాళ్లకే ఆ బంగ్లాలో ఉన్న 1500 ఏళ్ల నాటి దుష్టశక్తి ఎదురైతే ? ఇక అక్కడి నుంచి బయట పడటం అంత ఈజీ కాదు. ఒక పురాతన బంగ్లాలోకి అడుగు పెట్టిన యూట్యూబర్స్‌కి ఎదురైన ఊహించని భయంకరమైన అనుభవమే ‘అశ్విన్స్’ (Asvins). మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే… 

అర్జున్‌ ఒక యూట్యూబర్. అతనితో పాటు అతని ఫ్రెండ్స్‌ కూడా దెయ్యాలు, హాంటెడ్ ప్లేసెస్‌కు వెళ్లి వీడియోలు చేస్తుంటారు. భయంకరమైన ప్రదేశాల్లో షూట్ చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వాళ్లకు అలవాటు. అలాంటి సమయంలో బ్రిటిష్ కాలం నాటి ఓ పాడుబడ్డ బంగ్లా గురించి వాళ్లకు తెలుస్తుంది. ఆ ఇంటికి చాలా ఏళ్ల నాటి భయంకరమైన చరిత్ర ఉంటుంది. అక్కడికి వెళ్లిన వాళ్లు వింత అనుభవాలతో తిరిగి వచ్చేవారని ప్రచారం. అయినా వైరల్ కంటెంట్ కోసం అర్జున్, అతని ఫ్రెండ్స్ బంగ్లాలోకి అడుగు పెడతారు.

Advertisement

మొదట చీకటి గదులు, పాత వస్తువులు, వింత శబ్దాలను కెమెరాలో బంధిస్తూ సరదాగానే ముందుకు సాగుతారు. కానీ కొద్దిసేపటికే అక్కడ ఏదో అసాధారణమైన శక్తి ఉందని వాళ్లకు అర్థమవుతుంది. ఒకరికి కనిపించిన విషయం మరొకరికి కనిపించదు. ఎక్కడి నుంచో శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇంటి రహస్యాన్ని తెలుసుకునే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతలో వాళ్లు అనుకోకుండా 1500 ఏళ్ల నాటి ఓ దుష్టశక్తిని మేల్కొలుపుతారు. అది ఒక్కొక్కరినీ టార్గెట్ చేయడం మొదలు పెడుతుంది. దీంతో వీడియో కోసం వచ్చిన వాళ్లకు ఇప్పుడు కెమెరా కంటే ప్రాణాలే ముఖ్యమవుతాయి.

బంగ్లాలో అసలు ఏం జరుగుతోంది? ఆ దుష్టశక్తి ఎవరు? దానికి ఈ ఇంటితో ఉన్న సంబంధం ఏంటి? బయటపడే మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ అర్జున్, అతని స్నేహితులు సర్వైవల్ కోసం పోరాడతారు. అసలు ఆ 1500 ఏళ్ల శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అర్జున్ టీమ్‌లో ఎవరు బయటపడతారు? చివరికి ఆ బంగ్లా గతం ఎలా బయట పడుతుంది? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు ట్విస్ట్.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

‘అశ్విన్స్’కు తరుణ్ తేజ మల్లారెడ్డి దర్శకత్వం వహించారు. వసంత్ రవి, మురళీధరన్, విమలా రామన్, సరస్ మేనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుమారు 1 గంట 51 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హారర్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కింది. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా చూడొచ్చు. సైకలాజికల్ హారర్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా వైరల్ వీడియో కోసం వెళ్లిన వాళ్లే చివరికి ప్రాణాల కోసం పరుగెత్తాల్సి రావడం ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్.

Read Also: ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ

Tags

Related News

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

Big Stories

Advertisement
×