E-Paper
Advertisement

ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ

ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ
Advertisement

Musical Drama on OTT : ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం ఒక ఎత్తయితే… ఏకంగా పాతాళంలోకి వెళ్లి అక్కడి దేవుడితో ఒప్పందం చేసుకుని ఆమెను తిరిగి తీసుకురావడం మరో ఎత్తు. కానీ బయటకు వచ్చే సమయంలో పెట్టిన ఒక్క షరతు అతని ప్రేమనే పరీక్షిస్తే ? గ్రీక్ మైథాలజీలోని ఓర్ఫియస్, యూరిడైస్ విషాద ప్రేమకథను ఆధునిక సంగీతం, అద్భుతమైన స్టేజ్ పర్ఫార్మెన్స్‌తో తెరపైకి తీసుకొచ్చిన మూవీనే ‘Hadestown The Musical’. ఇప్పుడు డిజిటల్‌లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మ్యూజికల్ మూవీ కథేంటి ? ఎక్కడ చూడొచ్చు ? తెలుగులో ఉందా ? అన్న విషయం తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కథ యువ సంగీతకారుడు ఓర్ఫియస్ తో మొదలవుతుంది. తన పాటలతో ప్రపంచాన్ని మార్చాలని కలలు కనే అతని జీవితంలోకి యూరిడైస్ వస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ చలి, ఆకలి, పేదరికంతో నిండిన పరిస్థితులు వారి జీవితాలను కష్టాల్లోకి నెడతాయి. మరోవైపు పాతాళలోకానికి అధిపతి హేడిస్, తన ‘హేడ్స్‌టౌన్’లో పని, ఆహారం, భద్రత ఉంటాయని చెబుతూ మనుషులను తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి రావడం మాత్రం అంత సులభం కాదు.

Advertisement

పరిస్థితుల కారణంగా యూరిడైస్ కూడా హేడిస్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. తన ప్రియురాలు పాతాళంలోకి వెళ్లిపోయిందని తెలుసుకున్న ఓర్ఫియస్ మాత్రం వెనక్కి తగ్గడు. ఆమెను తిరిగి తీసుకురావడానికి ఏకంగా హేడ్స్‌ టౌన్‌లోకి అడుగు పెడతాడు. అక్కడ హేడిస్‌ను తన సంగీతంతో మెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఓర్ఫియస్ పాట అతని మనసును కదిలించడంతో యూరిడైస్‌ను తిరిగి తీసుకెళ్లేందుకు ఒక అవకాశం లభిస్తుంది. కానీ హేడిస్ ఓ షరతు పెడతాడు.

ఓర్ఫియస్ ముందుగా నడుస్తూ పాతాళం నుంచి బయటకు రావాలి. యూరిడైస్ అతని వెనుక వస్తుంది. అయితే బయటకు చేరుకునే వరకు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి ఆమెను చూడకూడదు. ఆమె తన వెనుకే ఉందన్న నమ్మకంతో ముందుకు సాగాలి. ఇక్కడి నుంచే అసలు టెన్షన్ మొదలవుతుంది. యూరిడైస్ నిజంగానే తన వెనుక వస్తుందా ? హేడిస్ మాట నిలబెట్టుకున్నాడా ? చివరి క్షణంలో ఓర్ఫియస్ తన భయాన్ని, అనుమానాన్ని జయించగలడా ? అనే ప్రశ్నలతో కథ క్లైమాక్స్‌కు చేరుతుంది.

Advertisement

అంతేకాదు… ఓర్ఫియస్, యూరిడైస్ ప్రేమకథకు సమాంతరంగా హేడిస్, పెర్సెఫోనీ బంధంలోని సమస్యలు కూడా కథలో కనిపిస్తాయి. ప్రేమ, నమ్మకం, పేదరికం, ఆశ, కోల్పోవడం వంటి భావాలను మైథాలజీతో కలిపి చూపించడం ఈ మ్యూజికల్ మూవీ ప్రత్యేకత.

Also Read : గుండెను చీల్చీ చూస్తే… టీవీ ప్రత్యక్షం, ఇదెక్కడి థ్రిల్లర్ మామా… మైండ్ బెండింగ్ అనుకో!

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

టోనీ అవార్డులు గెలుచుకున్న స్టేజ్ మ్యూజికల్‌కు లైవ్ ఫిల్మ్ వెర్షన్ ఈ మూవీ. బ్రెట్ సుల్లివన్ దర్శకత్వం వహించగా, రీవ్ కార్నీ, ఇవా నోబ్లెజాడా, ప్యాట్రిక్ పేజ్, అంబర్ గ్రే కీలక పాత్రల్లో నటించారు. 2025లో లండన్‌లోని Lyric Theatreలో జరిగిన లైవ్ ప్రదర్శనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం Amazon Prime Videoలో రెంట్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. రన్‌టైమ్ సుమారు 2 గంటల 21 నిమిషాలు ఉండగా, ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. గ్రీక్ మైథాలజీ, మ్యూజికల్ డ్రామా, ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ప్రేమ కోసం పాతాళంలోకి వెళ్లిన ఓర్ఫియస్… చివరి క్షణంలో తీసుకునే నిర్ణయం మాత్రం కథ మొత్తాన్ని మార్చేస్తుంది.

Related News

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Big Stories

Advertisement
×