OTT Movie : ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. వీటిలో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ లవ్ స్టోరీలు కళ్ళు చెమ్మగిల్లే విధంగా కూడా చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, 40 సంవత్సరాల వ్యక్తి 17 సంవత్సరాల యువకుడిగా మారిపోతాడు. తన లైఫ్ని మళ్లీ మొదలుపెట్టి, కుటుంబాన్ని దారిలో పెట్టే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘17 ఎగైన్‘ (17 Again). ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీకి బర్ స్టీర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో జాక్ ఎఫ్రాన్, లెస్లీ మాన్, థామస్ లెన్నాన్ మరియు మిచెల్ ట్రాచ్‌టెన్‌బర్గ్ నటించారు, ఈ మూవీ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పంపిణీ చేసింది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ $140 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
మైక్ కాలేజ్ లో బాస్కెట్ బాల్ గేమ్ ఆడటానికి వెళ్తుంటాడు. అదే సమయంలో ఇతని గర్ల్ ఫ్రెండ్ స్కార్లెట్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. బాస్కెట్ బాల్ ఆడటానికి వెళ్ళకుండా, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే నాకు జీవితం అని ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మ్యాగీ, అలెక్స్ ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతారు. అయితే పిల్లలతో మైక్ ఎక్కువ స్పెండ్ చేయలేకపోవడంతో, వాళ్ళు అతనితో కాస్త దూరంగానే ఉంటారు. చిన్న చిన్న గొడవల కారణంగా స్కార్లెట్ తో కొంతకాలం నుంచి విడిపోయి ఉంటాడు మైక్. స్కార్లెట్ డివోర్స్ తీసుకోవాలని మైక్ తో చెబుతుంది. ఈ క్రమంలో బాధలో ఉన్న మైక్ కి ఒక ముసలివాడు ఎదురవుతాడు. నీ లైఫ్ ని మళ్లీ మొదటి నుంచి చూడాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఇంతలోనే మైక్ 17 సంవత్సరాల యువకుడిగా మారిపోతాడు. మైక్, స్కార్లెట్ తో విడిపోయాక మేడి అనే ఫ్రెండ్ తో కలిసి ఉంటాడు. టీనేజ్ గా మారిపోయిన మైక్ ని చూసి ఎవరో దొంగ అని భయపడతాడు మేడి. ఆ తర్వాత విషయం తెలుసుకొని మైక్ ని దగ్గరికి తీసుకుంటాడు. మైక్ తన పిల్లలు చదివే స్కూల్లో మళ్ళీ చదవటానికి జాయిన్ అవుతాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ గా మళ్లీ మొదలు పెట్టాలని అనుకుంటాడు. ఆ తరువాత మ్యాగీ ఒక బ్యాడ్ బాయ్ ని లవ్ చేస్తూ ఉంటుంది. అలెక్స్ కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరిని దారిలో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు మైక్.
మ్యాగీ ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని ఏడుస్తూ ఉంటుంది. మైక్ ఆమెను ఓదారుస్తుంటాడు. తన మీద మైక్ కి ఇష్టం ఉందని, అందుకే నన్ను కేరింగ్ చేస్తున్నాడని అనుకుంటుంది మ్యాగీ. ఆ తరువాత మైక్ ని ఇష్టపడటం మొదలు పెడుతుంది మ్యాగీ. అయితే ఒకరోజు తన తల్లి స్కార్లెట్ తో మైక్ క్లోజ్ గా ఉండటం చూసి బాధపడుతుంది. చివరికి విడాకుల విషయంలో కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది మైక్. తనకి మైక్ ఒక లెటర్ ఇచ్చి పంపాడని కోర్టులో చెప్తాడు టీన్ ఏజ్ మైక్ . ఆ లెటర్ చదువుతూ స్కార్లెట్ మీద మైక్ కు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తాడు. స్కార్లెట్ కూడా విడాకుల విషయంలో కాస్త వెనకడుగు వేస్తుంది. ఆ తర్వాత ఆ లెటర్ తీసుకున్న స్కార్లెట్ అందులో ఏముందో చూసి షాక్ అవుతుంది. అందులో కోర్టుకు రావాల్సిన అడ్రస్ మాత్రమే ఉంటుంది. మరి మైక్ తన గురించి విషయాలను ఎలా చెప్పగలిగాడని ఆలోచిస్తుంది. చివరికి మైక్ ఎవరో స్కార్లెట్ కి తెలుస్తుందా? మైక్ మళ్ళీ తన అసలు రూపానికి వస్తాడా? ఫ్యామిలీతో మళ్లీ హ్యాపీగా కలిసి జీవిస్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.